Here is the top-10 highest worldwide grossers in 2016. In this list Janatha Garage stood at first position where Sarrainodu is in Second place. Shocking fact is that, a dubbing movie Bichagadu has got place in telugu movies list.
2016లో ఎన్నో సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయగా, మరికొన్ని చతికిలపడిపోయాయి. అయితే.. హీరోల స్టార్‌డమ్ కారణంగా డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు సైతం మంచి వసూళ్లు రాబట్టగలిగాయి. అవే ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం సంచలనాలు క్రియేట్ చేయడంతో.. అదే టైటిల్‌తో సీక్వెల్ రావడంతో దానికి ఎనలేని క్రేజ్ వచ్చింది. రూ.100 కోట్లు రాబడుతుందనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కానీ.. రిలీజయ్యాక ఈ చిత్రం ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయినప్పటికీ ఫస్ట్ వీక్‌లోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరి, ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత ఈ చిత్రం వసూళ్లు భారీగా డ్రాప్ అవ్వడంతో.. టోటల్ రన్‌లో రూ.53 కోట్లకుపైగా షేర్ రాబట్టింది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది టాప్-10 గ్రాసర్స్‌లో 7వ స్థానం దక్కించుకుంది.
ఇక ‘బ్రహ్మోత్సవం’ విషయానికొస్తే.. అంతకుముందు మహేష్ చేసిన ‘శ్రీమంతుడు’ చిత్రం ‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలవడంతో, ఈ క్రేజ్ ఆ సినిమాకి కలిసొచ్చింది. దాంతో.. దానిపై భారీ అంచనాల ఏర్పడ్డాయి. కానీ.. తీరా రిలీజయ్యాక ఆ అంచనాలన్నీ తిరగబడ్డాయి. మహేష్ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్‌గా నిలిచింది. కానీ.. క్రేజ్ కారణంగా ఈ చిత్రం రూ.39 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో.. ఈ ఏడాది టాప్-10 గ్రాసర్స్‌లో ఈ చిత్రం 9వ స్థానం కైవసం చేసుకుంది.
ఇక మిగతా సినిమాలన్నీ తమ సత్తా చాటుకుని.. టాప్-10లో స్థానం కల్పించుకున్నాయి. ‘జనతా గ్యారేజ్’ అత్యధిక వసూళ్లు రాబట్టడంతో.. మొదటి స్థానంలో నిలవగా.. దాని తర్వాత ‘సరైనోడు’ చిత్రం రెండో స్థానం దక్కించుకుంది. వీటి తర్వాత.. ఊపిరి, ధృవ, నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయన, అ ఆ, బిచ్చగాడు వరుసగా 3, 4, 5, 6, 8, 10 స్థానాల్లో నిలిచాయి. విశేషం ఏమిటంటే.. ఓ డబ్బింగ్ సినిమా (బిచ్చగాడు) ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం.
1. జనతా గ్యారేజ్
2. సరైనోడు
3. ఊపిరి
4. ధృవ
5. నాన్నకు ప్రేమతో
6. సోగ్గాడే చిన్నినాయన
7. సర్దార్ గబ్బర్ సింగ్
8. అ ఆ
9. బ్రహ్మోత్సవం
10. బిచ్చగాడు