Newsడైరెక్టర్‌తో యాంకర్ డేటింగ్ .. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

డైరెక్టర్‌తో యాంకర్ డేటింగ్ .. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

TV serial director Madhukar caught redhanded to his wife with anchor Geetha bhagavath in hotel room. After this incident she kept silent for her children’s future. But that anchor started to torture her. Finally, she went to police station and complaint on their illegal relationship.

ఇండస్ట్రీలో ఉన్న తారలకు ఇదేం పిచ్చో తెలీదు కానీ.. ఆల్రెడీ పెళ్ళయి, పిల్లలున్న వారితోనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ.. రాంగ్ రూట్‌లో అడుగులేస్తూ కెరీర్‌ని నాశనం చేసుకోవడంతోపాటు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగుచూసింది.

ఆల్రెడీ పెళ్లయి, భార్యాపిల్లలతో హాయిగా గడుపుతున్న ఒక టీవీ సీరియల్ దర్శకుడు మధుకర్‌తో గీతా భగవత్ అనే యాంకర్ ఎఫైర్ పెట్టుకుంది. అతడ్ని ఎంతగా తన వలలో పడేసిందంటే.. చివరికి తన భార్యాపిల్లల్ని వదిలేసి ఆమెతోనే ఉండిపోయాడు. దీంతో.. రోజూ రాత్రి సమయానికి ఇంటికొచ్చే భర్త ఈమధ్య అలా రాకపోవడంతో ఆ దర్శకుడి భార్యకి అనుమానం వచ్చింది. అప్పటినుంచి ఆమె తన భర్తపై సీక్రెట్‌గా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే యాంకర్ గీతా భగవత్‌తో చాలా సన్నిహితంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న ఆమె.. ఓరోజు వారిని బెడ్‌రూమ్‌లో రొమాన్స్ చేస్తూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

‘ఇదేంటి?’ అని ప్రశ్నిస్తే.. ఆ ఇద్దరూ ఆమెని దబాయించారు. దాంతో.. ఏం చేయలేక సైలెంట్‌గానే ఉండిపోయింది. ఎలాగో తమ బండారం బయటపడింది కదా అని.. వాళ్లు ఇంట్లోనే సహజీవనం చేయడం మొదలెట్టారు. తన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్న ఉద్దేశంతో.. వారిద్దరికి ఎదురించలేకపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ యాంకరమ్మ.. దర్శకుడి భార్యని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించింది. తాను చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చింది.

రానురాను ఆమె ఆగడాలు ఎక్కువవడం, భర్త చూస్తూ సైలెంట్‌గానే ఉండడం చూసి సహించలేకపోయిన అతని భార్య.. చివరికి పోలీసుల్ని ఆశ్రయించింది. తన భర్త మధుకర్ కొన్నాళ్ల నుంచి యాంకర్ గీతాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరూ తమ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారని, వాళ్లు నిత్యం తనని వేధిస్తున్నారని వాపోయింది. ఆ యాంకర్ వల్లే మధుకర్ తనని ఇంట్లో నుంచి గెంటేశాడని, తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news