మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది.అది వేడి పుట్టిస్తూ ఉంటుంది.అందుకే అక్కడ చల్లదనం అవసరం.పసుపు,కుంకుమ,తిలకం,భస్మం,చందనం,శ్రీచూర్ణం వగైరాలు ఈ అవసరాన్ని తెరుస్తాయి.ముఖం మీద బొట్టు గుండ్రంగా పెట్టుకోవాలా?అడ్డంగా పెట్టుకోవాలా?నిలువుగా పెట్టుకోవాలా? అని అడిగితే ఎవరికిష్టం వచ్చినట్టు వారు, వారివారి వంశాచారం ప్రకారం పెట్టుకోవచ్చు.
ఏ బొట్టయినా ముఖానికి అందాన్ని, తేజస్సును ఇస్తుంది.మొత్తం మీద అడ్డంగా పెట్టుకునే భస్మం ఆయుర్వుద్ధిని ఐశ్వరాభివృద్ధిని కలిగిస్తుంది.నిలువుగా పెట్టుకునే శ్రీచూర్ణం బ్రహ్మరంధ్రము ద్వారా జీవాత్మ చేరుకునే పరమపదాన్ని సూచిస్తుంది.కనుబొమ్మల మధ్య బొట్టు నాడీ మండలంపై అనుకూల ప్రభావం చూపుతుంది.