కొన్ని సంవత్సరాల పాటు వరుసగా సినిమాలు చేసిన ఒకే ఒక్క తెలుగు హీరో రవితేజ. ఒక్కోసారి థియేటర్‌లో ఉన్న సినిమా వంద రోజులు పూర్తి చేసుకునే సరికి రెండో సినిమాని రెడీ చేసి ఉండేవాడు రవితేజ. అలాగే రిలీజ్ డేట్స్ విషయంలో రవితేజ సినిమాలే ఒకదానితో ఒకటి పోటీ పడేవి. అలాంటి రవితేజ తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంతగా ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు? చాలా సినిమాలు అనౌన్స్ అవుతున్నాయి కానీ ఒక్కటి కూడా స్టార్ట్ అవడం లేదు. పైగా దిల్ రాజు లాంటి వాళ్ళతో చేయాల్సిన సినిమాలు కేన్సిల్ అవుతున్నాయి.
ఈ మొత్తం ఎపిసోడ్‌కి కారణాలు ఏంటా అని ఆరా తీస్తే ఎక్కువ భాగం రెమ్యూనరేషన్‌కి సంబంధించిన విషయాలే అని తెలిసింది. అయితే రవితేజకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన పూరీ మాత్రం ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని ఓ కొత్త విషయం బయటపెట్టాడు. నేను, రవి గత పదిహేనేళ్ళుగా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నామని, అందుకే రవితేజ కాస్త రెస్ట్ కోరుకున్నారని ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట రవితేజ. పూరీ చెప్పిన విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. నిజం కూడా ఉంది. కానీ అసలు సినిమాలన్నీ కూడా అనౌన్స్‌మెంట్ వరకూ ఎందుకు వస్తున్నాయి? దిల్ రాజు సినిమా సెట్స్‌పైకి వెళ్ళాల్సిన దశలో ఎందుకు ఆగిపోయింది? గ్యాప్ దొరికింది కాబట్టి రవితేజ వరల్డ్ టూర్‌కి వెళ్ళాడా? లేక గ్యాప్ తీసుకుని వెళ్ళాడా? వినడానికి బాగానే ఉన్నా సగటు అభిమానికి మాత్రం పూరి చెప్పిన విషయాలు కాస్త షాకింగ్ గానే ఉన్నాయి….