Moviesదిల్ రాజు, శివ కార్తికేయన్, కీర్తి సురేష్‌ల ‘రెమో’ మూవీ రివ్యూ...

దిల్ రాజు, శివ కార్తికేయన్, కీర్తి సురేష్‌ల ‘రెమో’ మూవీ రివ్యూ మరియు రేటింగ్

The review of Siva Karthikeyan and Keerthy Suresh’s latest movie ‘Remo’ which is directed by Bakkiyaraj Kannan. This movie has already created sensation in kollywood by collecting more than 65 crores gross collections. Let’s see how this movie get response from Telugu audience.

సినిమా : రెమో
నటీనటులు : శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, తదితరులు
దర్శకత్వం : బక్కియరాజ్ కన్నన్
నిర్మాత : ఆర్డీ రాజా (తెలుగులో దిల్‌రాజు)
బ్యానర్ : 24ఏఎమ్ స్టూడియోస్
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్
ఎడిటర్ : రూబెన్
రిలీజ్ డేట్ : 25-11-2016

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తి సురేష్ జంట‌గా నటించిన తాజా చిత్రం ‘రెమో’. బ‌క్కియరాజ్‌ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం కోలీవుడ్‌లో 40 కోట్లకుపై షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నారు. మరి.. తమిళంలోలాగే తెలుగు ఆడియెన్స్‌ని ఈ చిత్రం మెప్పించిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ :
ఎస్‌కె (శివ కార్తికేయన్)కి చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని అనుకుంటాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తాడు. ఈ నేపథ్యంలోనే ఎస్‌కేకి కావ్య(కీర్తి సురేష్) అనే అమ్మాయి కనిపించగా.. ఫస్ట్ సైట్‌లోనే ఆమెని ప్రేమిస్తాడు. ఆమెకి దగ్గరయ్యేందుకు ట్రై చేస్తాడు. ఒకరోజు తన ప్రేమని తెలియజేయడం కోసం కావ్య ఫ్లాట్‌కి ఎస్‌కే వెళ్ళగా.. ఓ షాకింగ్ విషయం తెలిసి వెనుదిరుగుతాడు. కట్ చేస్తే.. ఓరోజు సినిమాలో వేషం కోసం నర్స్ గెటప్ వేసుకుని ఎస్‌కె బస్ ఎక్కగా.. అదే బస్సులో ఉన్న కావ్య అతడ్ని నిజంగానే నర్స్ అనుకుని పరిచయం చేసుకుంటుంది.

అంతేకాదు.. తను పని చేసే ఆసుపత్రిలోనే అతనికి నర్స్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. అలా అనుకోకుండా కావ్యిక దగ్గరైన ఎస్‌కె.. తన పేరు రెమోగా మార్చుకొని ఆమె ప్రేమను దక్కించుకోవడం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి.. ఈసారి ఎస్‌కె విజయం సాధిస్తాడా? ఆరోజు ఫ్లాట్ నుంచి ఎస్‌కె ఎందుకు కావ్యని ప్రపోజ్ చేయకుండా వెనక్కి వస్తాడు? చివరికి అతను కావ్య ప్రేమను పొందగలుగుతాడా? ఇంతకీ.. తాను చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు హీరో అవుతాడా? లేదా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
సాధారణ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాల్లాగే ఈ మూవీ కథ కూడా పాతదే. హీరోయిన్‌ని చూసిన మొదటిచూపులో హీరో ప్రేమలో పడడం.. ఆమెని దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడడం.. లాంటి కాన్సెప్ట్‌తోనే ఈ మూవీ తెరకెక్కింది. అయితే.. ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదాగా సాగిపోతుంది. రొటీన్ స్టోరీ అయినా.. కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ బోలెడన్నీ ఉండడంతో ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరోయిన్‌ని తన ప్రేమలో పడేయడం కోసం హీరోలు పడే తంటాల చుట్టే నడుస్తుంది. మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. సిట్యువేషనల్‌గా వచ్చే పాటలు బాగున్నాయి. ప్రీ-ఇంటర్వెల్ వరకు సినిమా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది. ఆ ఇంట్రెస్టింగ్‌తో మొదలయ్యే సెకండాఫ్ కూడా బాగుంది. ముఖ్యంగా.. హీరోయిన్‌ని దక్కించుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు చాలా ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి. హీరోహీరోయిన్ల మధ్య నడిచే కామెడీ ట్రాక్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక సినిమాని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా.. ఈ చిత్రం ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇస్తుంది.

ఇందులో ప్లస్, మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే.. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్‌గా సాగితే, సెకండాఫ్ కాస్త బోర్ కొట్టించింది. కొన్ని సీన్లు రిపీట్ కావడం, వాటిని మరింత సాగదీయడంతో విరక్తి కలిగిస్తాయి. కామెడీ పేరిట కొన్ని అనవసరమైన సీన్లను జోడించారు. వీటన్నింటిని లైట్ తీసుకుంటే.. ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
హీరో శివకార్తికేయన్ తన భుజాలమీద సినిమా మొత్తాన్ని నడిపించాడు. రెమోగా, నర్స్ పాత్రల్లో అదరగొట్టేశాడు. మొదటినుంచి చివరి వరకు తన నటనతో కట్టిపడేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన యువకుడిగా తను చెప్పే డైలాగ్స్, నటించే తీరు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. ఇక ‘నేను శైలజ’లో సైలెంట్‌గా కనిపించిన కీర్తి సురేష్ ఇందులో బాగానే అల్లరి చేసింది. డాక్టర్ పాత్రలో ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
పీసీ శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ హైలైట్. ఆయన ప్రతి ఫ్రేమ్‌ని చాలా కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా చూపించారు. అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరాయి. ఎడిటింగ్‌లో సెకండాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ గురించి మాట్లాడితే.. మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా తెరకెక్కించాడు. ఎంచుకున్న స్టోరీ రొటీన్ అయినప్పటికీ.. ప్రేక్షకులకు కావల్సిన ఎలిమెంట్స్ జోడించి, మెప్పించాడు. అయితే..సెకండాఫ్‌లో కాస్త శ్రద్ధ చూపించాల్సింది.

చివరగా : యూత్‌కి కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్

రెమో మూవీ రేటింగ్ : 3/5

https://youtu.be/ze-ZTfcj9PQ

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news