Movies ‘ధృవ’ ట్రైలర్ టాక్ : దొంగా-పోలీస్ ఆట అదిరింది!

‘ధృవ’ ట్రైలర్ టాక్ : దొంగా-పోలీస్ ఆట అదిరింది!

Mega hero Ram Charan’s latest movie Dhruva trailer has released, and it is really very awesome than expected. In this trailer charan impressed with his handsome look and energy in IPS office role. On the otherside actor Aravind Swamy who is antagonist also look very stylish, and attracted with his acting skills. Rakul Preet Singh also looking very pretty.

రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్‌. ఇటీవల ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అవ్వగా.. దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. పదండి.. అదెలా ఉందో చూద్దాం..

‘ఎవర్ని కొడితే వందమంది క్రిమినల్స్ అంతమవుతారో.. అతడే నా టార్గెట్‌’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ చాలా స్టన్నింగ్‌గా ఉంది. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్‌గా చరణ్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక సిద్ధార్థ్ అభిమన్యు అనే విలన్ పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి తన స్టైలిష్ లుక్, నటనతో ఆకట్టుకున్నాడు. ఇతని కోసమే చరణ్ తన వేట మొదలుపెడతాడని ట్రైలర్‌లో స్పష్టం చేసేశారు. ఇద్దరిమధ్య వచ్చే క్లిప్స్ చూస్తుంటే.. సినిమాలో ఆ సీన్స్ పతాకస్థాయిలో ఉంటాయని అర్థం అవుతోంది. వీరి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగానే డైలాగులు అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా హాలీవుడ్‌‌ని తలపించేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ మధ్యలో ఓ ఫ్రేమ్‌లో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎంతో అందంగా, క్యూట్‌గా కట్టిపడేసింది. ఓవరాల్‌గా.. ఈ ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది.

టెక్నికల్ పరంగా చూసుకుంటే.. దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తమిళ చిత్రంతో ఏమాత్రం సంబంధం లేకుండా చాలా డిఫరెంట్‌గా సీన్స్‌ని తీర్చిదిద్దాడు. పి.ఎస్.వినోద్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ప్రతి ఫ్రేమ్‌ని చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించాడు. హిప్‌హాప్ తమిళ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మైండ్‌బ్లోయింగ్. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి ఎక్కడా వంక పెట్టడానికి లేదు. మొత్తానికి.. ఈ చిత్రబృందం ట్రైలర్‌తో ఆకట్టుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news