ఎస్.ఎస్. రాజమౌళి….అంతకుముందు కూడా అన్నీ హిట్సే మనవాడికి. కానీ బాహుబలి సినిమా సక్సెస్ మాత్రం ఇండియాతో పాటు కొన్ని ప్రపంచ దేశాల్లో కూడా రాజమౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ ప్రభావం మొత్తం ఇప్పుడు బాహుబలి-2 సినిమా బిజినెస్ విషయంలో కనిపిస్తోంది. అంతకుముందు వరకూ శంకర్‌లాంటి డైరెక్టర్స్ తీసిన సౌత్ సినిమాలు హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకుంటే అబ్బో అనేవాళ్ళు. కానీ ఇఫ్పుడు రాజమౌళి మాత్రం మొత్తం చరిత్ర గతినే మార్చేలా ఉన్నాడు.
బాలీవుడ్ ఖాన్స్ నటించిన సినిమాలతో సమానంగా బాహుబలి-2 శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. సోనీ టీవీ వాళ్ళు 51 కోట్ల రూపాయలకు బాహుబలి-2 హిందీ శాటిలైట్ రైట్స్‌ని కొనేశారు. బాహుబలికి ముందు వరకూ తెలుగులోనే ప్రభాస్ నంబర్ ఒన్ హీరో కాదు. ఇక మిగతా ఆర్టిస్ట్స్‌కి కూడా అంత సీన్ లేదు. మరి ఈ రేంజ్‌లో బాహుబలికి క్రేజ్ ఎలా వస్తుంది? దట్ ఈజ్ రాజమౌళి మేజిక్. బాహుబలి-2 సినిమా ఏ కొంచెం బాగున్నాకూడా బాలీవుడ్ ఖాన్స్, ఇంకా సూపర్ స్టార్స్‌మి, మా రేంజ్ వేరు అని చెప్పుకునేలా కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం. అదే జరిగితే మాత్రం ఇండియాలోనే నంబర్ ఒన్ హిట్ సినిమాగా బాహుబలి-2 నిలుస్తుంది. అలాంటి రికార్డ్‌ని బాహుబలికి ముందు ఊహించే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేరేమో. కానీ మన జక్కన్న మాత్రం ఆ చరిత్ర గతిని మారుస్తూ ఓ తెలుగు సినిమాను ఇండియన్ నంబర్ ఒన్ హిట్ చిత్రంగా నిలిపే ప్రయత్నంలో దూసుకుపోతున్నాడు.