Gossipsవినాయక్ తోనే ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిల్మ్.. అదుర్స్-2 కాదు 'ఆది'ని మించి!!

వినాయక్ తోనే ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిల్మ్.. అదుర్స్-2 కాదు ‘ఆది’ని మించి!!

Good news for young tiger ntr fans. Finally ntr has fixed his next director with whom he already done two blockbuster project. If all goes well then this duo will go on floors very soon. Just have to wait for few days more for official announcement of this project.

‘జనతా గ్యారేజ్’ విడుదలై మూడు నెలలు కావస్తున్నా.. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. మధ్యలో కొందరు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ.. ఎవ్వరూ కన్ఫమ్ అవ్వలేదు. మరి.. ఎన్టీఆర్ ఏ దర్శకుడితో తన తదుపరి చిత్రం చేస్తాడా? అని అనుకుంటున్న తరుణంలో.. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దాదాపు ఖరారైనట్లు ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చాలాకాలం నుంచే ఈ వార్త వినిపిస్తోంది కానీ.. ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. ఇందుకు కారణం.. రీసెంట్‌గా వీరి మధ్య సీక్రెట్‌గా మీటింగ్ జరగడమే! తారక్ సన్నిహిత వర్గాలే ఈ విషయాన్ని వెల్లడించాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ని తెరకెక్కిస్తున్న వినాయక్.. ఇటీవల ఎన్టీఆర్‌ని కలిశాడట. తన వద్ద ఉన్న కొత్త స్టోరీలైన్‌ని వినిపించగా.. పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆదేశాలిచ్చాడని తెలుస్తోంది. తొలుత ‘అదుర్స్-2’ తీద్దామని అనుకున్నారు కానీ.. తనకు ఫ్రెష్ కాన్సెప్ట్ కావాలని తారక్ డిసైడ్ అవ్వడంతో.. అతని సూచన మేరకు కొత్త కథని రెడీ చేయనున్నట్లు తెలిసింది. అంతా తాను అనుకున్నట్లే వర్కౌట్ అయ్యాక.. స్వయంగా తారకే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నాడని, అంతవరకు సీక్రెట్‌గానే ఉంచాలని ఫిక్స్ అయినట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. మరి.. ఇది కూడా రూమరేనా? లేక నిజంగానే ఎన్టీఆర్-వినాయక్ కాంబో కుదరనుందా? ఇది తెలియాలంటే.. కొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఒకవేళ వీరి కాంబోలో మూవీ ఓకే అయితే మాత్రం.. అది రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘ఆది’, ‘అదుర్స్’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. అలాంటి వీరి కాంబోలో ఇప్పుడు మరో సినిమా వస్తే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ నెలకొనడం ఖాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news