ఫస్ట్ వీకెండ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘చిన్నవాడు’ !!

EPC first weekend collections

Young hero Nikhil Siddhartha’s latest film Ekkadiki Pothavu Chinnavada has collected huge collections in it’s first weekend run around the world which is said to be his career’s record. This movie directed by VI Anand and Hebbah Patel, Nanditha Swetha starred as heroine opposite to Nikhil.

యంగ్ హీరో నిఖి సిద్ధార్థ తాజా చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బంది నెలకొన్న తరుణంలోనూ భారీ వసూళ్లు రాబడుతూ ఔరా అనిపిస్తోంది. ఓవైపు పెద్ద పెద్ద సినిమాలే కలెక్షన్స్ లేక చాప చుట్టేస్తుంటే.. ఈ చిత్రం మాత్రం కోట్లు కొల్లగొడుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం మూడురోజుల్లో రూ.6.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది నిఖిల్ కెరీర్‌లోనే పెద్ద ఫిగర్. విశేషం ఏమిటంటే.. తొలిరోజు (రూ. 1.82 కోట్లు) కంటే.. శనివారంనాడే (రూ.2.30 కోట్లు) ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆదివారం (రూ.1.98) కూడా అదే జోరు కొనసాగించింది.

సాధారణంగా.. ఏ సినిమాకైనా మొదటిరోజు భారీ కలెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత రోజునుంచి డ్రాప్ అవుతూ వస్తాయి. కానీ.. ఈ మూవీ విషయంలో రిజల్ట్ అందుకు భిన్నంగా రావడం విశేషమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మొదట్నుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండడం.. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌, కామెడీతో కట్టిపడేయంతో జనాలు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే.. ఈ చిత్రం ఆ రేంజులో వసూళ్లు రాబట్టిందని అంటున్నారు. ఈ మూవీ దూకుడు చూస్తుంటే.. టోటల్ రన్‌టైంలో రూ.20 కోట్లకుపైగా కలెక్షన్స్ తన ఖాతాలో జమ చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందిత శ్వేత, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా నటించారు.

ఏరియాల వారీగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 1.70
సీడెడ్ : 0.50
వైజాగ్ : 0.48
గుంటూరు : 0.42
కృష్ణా : 0.34
తూర్పు గోదావరి : 0.32
పశ్చిమ గోదావరి : 0.21
నెల్లూరు : 0.13
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 4.10 కోట్లు

యూఎస్‌ఏ : 1.35
కర్ణాటక : 0.65
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ. 6.10 కోట్లు

Leave a comment