Nayanthara hikes her remuneration and become second highest grosser after Anushka Shetty in South Film Industry. She has a huge demand in the industry thats why producers are ready to pay amount as much as she wants.
ఓ వయసొచ్చాక హీరోయిన్ల హవా తగ్గిపోతుంది. పైగా.. కుర్రభామల జోరు ప్రదర్శిస్తుండడంతో సీనియర్ తారలు ఫేడ్ ఔట్ అయిపోతారు. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న ఓ దిక్కుమాలిన ఆచారం. ఇప్పుడు దీనికి కొందరు భామలు చెక్ పెట్టారు. మూడుపదుల వయస్సు దాటినా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వారిలో నయనతార ఒకరు. 32 ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు ఘాటుగా అందాలు ఆరబోస్తూ చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతి హీరోతోనూ సినిమాలు చేస్తోంది. దాంతో.. ఈమె క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇంకేముంది.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన్ని తూ.చ.తప్పకుండా పాటిస్తోంది.
ప్రస్తుతం అరడజనుకుపైగా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న నయనతార.. అక్షరాల రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అవును.. మీరు వింటోంది అక్షరాల నిజమే. స్వీటీ అనుష్క తర్వాత అంతమొత్తం పారితోషికం తీసుకుంటున్న రెండో భామ నయనే. ‘ఈనాడు’ ఫేం చక్రి తోలేటి ‘కోలైయుదిర్ కాలం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనిని యువన్ శంకర్ రాజా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మొత్తంలో కథానాయిక పాత్రే కీలకం కాబట్టి.. దానికి నయనతార అయితేనే పూర్తి న్యాయం చేస్తుందని భావించి, నిర్మాతలు ఆమెని సంప్రదించారట. ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన.. రూ.3 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. తొలుత సంకోచించిన నిర్మాతలు.. చివరికి ఆమె డిమాండ్‌ని అంగీకరించారని తెలిసింది. దక్షిణాది ఇండస్ట్రీలో నయన నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది కాబట్టి.. అంతమొత్తం ఇవ్వడం సమంజమేనని అంటున్నారు.
ఒకప్పుడు ‘బిల్లా’ సినిమాకు రూ.1.5 కోట్లు తీసుకుని అప్పట్లో రికార్డ్ సృష్టించిన నయన.. ఆ తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ రూ.3 కోట్ల మార్క్‌కి చేరింది. ఇప్పటికీ ఈ అమ్మడి హవా కొనసాగుతుండడాన్ని బట్టి చూస్తుంటే.. మరో మూడేళ్ళు కంటిన్యూగా సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆలోపు ఈమె రెమ్యునరేషన్ రూ.4 కోట్లకి చేరినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.