Newsనోటు..నమ్మకం ఓ మన్మోహన్!!

నోటు..నమ్మకం ఓ మన్మోహన్!!

ExPM Manmohan Singh spoke in Parlimentary and he said that people will loose confidence on currency with the Demonetisation effect. He strongly oppose the Modi’s govt demonetisation decision.

నిన్నటి దాకా కళకళలాడిన పచ్చనోటు, మోదీ ఒక్క ప్రకటనతో వెలవెలబోయింది. నల్లధనాన్ని అడ్డుకునేందుకు మోదీ తీసుకున్న కీలక నిర్ణయంతో సామాన్యుడు సైతం షాక్ తిన్నాడు. పాతకాలంలో మనపెద్దవాళ్లు చెప్పినట్లు ప్రతి మనిషి తన జీవితకాలంలో ఓ ఆవు, కోడిగుడ్డంత బంగారం సంపాదించుకోవాలి.. అది ఖచ్చితంగా ఆపదకాలంలో కాపాడుతుంది అని అనే వాళ్లు. ఆవు సంగతిపక్కన బెడితే బంగారం విషయంలో మాత్రం నిజమే అనిపిస్తోంది. అందుకే కావొచ్చు మనవాళ్లు గతంలో తమ వద్ద ఎంత ఉన్నా బంగారం కొనేవాళ్లు. మోదీ సీజన్ లో మరోసారి అదే రిపీట్ అవుతుందా? బంగారం పాతిపెట్టే రోజులు మళ్లీ వస్తాయా? అనే చర్చకు తెరలేచింది.

పార్లమెంట్ సమావేశాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. కేంద్రం సరైన చర్యలకు దిగకుండా పెద్దనోట్ల రద్దు(Demonetisation)నిర్ణయం తీసుకుందని.. దాని వల్ల అందరికి నష్టంకలుగుతోందని అన్నారు. అందులో భాగంగా కేంద్రం చర్యలు ‘ప్రజలకు నగదు మీద నమ్మకంపోయేలా చేస్తోంది’ అని అన్నారు. నిజమే చాలా మంది నరేంద్రమోదీ నిర్ణయం తర్వాత చేతిలో ఉన్న పచ్చనోట్లను చూసి బాధపడ్డా, ఇంట్లో ఉన్న బంగారం చూసి మాత్రం సంతోషించారు. అవును మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరోక్షంగా నగదు మీద నమ్మకంలేకుండా చేస్తోంది అన్నదాంట్లో వాస్తవం ఉంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అంచనాల ప్రకారం నగదును నియంత్రించడం వల్ల దేశ ప్రజలు క్రమంగా డిజిటల్ లావాదేవీలకు పాల్పడతారు. దానివల్ల చెల్లింపుల్లో పారదర్శకత వస్తుంది. చెల్లింపుల సంగతి ఎలా ఉన్నా కూడగట్టుకున్న దాని విషయంలో మాత్రం ఇప్పుడు అందరూ నగదును నమ్మడం లేదు. అంటే ఇంట్లో డబ్బులు ఉండటం కన్నా బంగారమో, వెండో లేదంటే డైమండ్స్ ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఓ రకంగా పరోక్ష ఆర్థిక వ్యవస్థకు అవకాశం కల్పిస్తున్నారు. ఇది మోదీ లక్ష్యాలకు చేటు చేసేదే. స్వయంగా ఆర్థికవేత్త, సంస్కరణలవేత్తగా గుర్తింపు ఉన్న మన్మోహన్ సింగ్ మాటల్లో నిజాన్ని మోదీ సర్కార్ గుర్తించాలి. జరుగుతున్నపరిణామాలు, భవిష్యత్తుకు చేటుచెయ్యకుండా వెంటనే చర్యలకు దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news