సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ఫెయిల్యూర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో యమబిజీగా మారిపోయాడు. ఈ చిత్ర షూటింగ్ స్పీడు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తాడా? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. సినిమా అనౌన్స్ చేసిన చాలా రోజుల వరకు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటక్కెక్కిందా అనే స్టేజ్‌లో అనుకోకుండా సినిమా ముహూర్తం ఫిక్స్ చేయడం.. సినిమాకు డైరెక్టర్‌గా వచ్చిన ఎస్.జే.సూర్య సినిమా నుండి వాకౌట్ చేయడం కూడా అంతే స్పీడుగా జరిగిపోవడంతో ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయడానికి పవన్ కంకణం కట్టుకున్నాడు. అందుకు కారణం సర్దార్ సినిమా మిగిల్చిన నష్టాలు.
అవును.. సర్దార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో సినిమా బిజినెస్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. కానీ సినిమా రిజల్ట్ తరువాత బయ్యర్ల నష్టాలను తన నెక్ట్స్ మూవీ ద్వారా తీరుద్దాం అని ఫిక్స్ అయిన పవన్‌కు కాటమరాయుడు దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. సినిమా లేటుగా స్టార్ట్ కావడం మొదలు, డైరెక్టర్ సూర్య తప్పుకోవడం, తరువాత గోపాల గోపాల ఫేం డాలీని డైరెక్టర్‌గా ఫిక్స్ చేసాడు పవన్. అయితే ఇది కూడా పవన్‌కు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. కాటమరాయుడు సినిమా బిజినెస్ విషయంలో బయ్యర్లు చాలా తక్కవు ఆసక్తి కనబరుస్తున్నారట. దీంతో అనుకున్న రేటుకు సినిమా అమ్ముడుపోయే అవకాశం లేకపోవచ్చని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అందుకు కారణం డైరెక్టర్ డాలీ అని చెబుతున్నారు వారు. ఈ సినిమాకు డాలీ కాకుండా త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ ఉండి ఉంటే బిజినెస్ బాగా జరిగేదని వారి అంచనా. దీంతో మరి ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తున్న పవన్‌కు సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనే టెన్షన్ పట్టిందట.