జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి? డైరెక్టర్ ఎవరు? అన్న విషయాలు బయటకు తెలియనివ్వకుండా మెయింటైన్ చేస్తున్నారు కానీ లోపల్లోపల మాత్రం చాలా యాక్టివిటీస్ జరిగిపోతున్నాయని తెలుస్తోంది. తన నెక్ట్స్ సినిమాని పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. ఆల్రెడీ పూరీ కథ మొత్తం కూడా బౌండ్ స్క్రిప్ట్ రూపంలో ఎన్టీఆర్ దగ్గర ఉందట. అయితే ఆ స్క్రిప్ట్‌ని ఇంకా ఇంకా డెవలప్ చేయమని మాత్రం పూరీకి చెప్తూ ఉన్నాడట. ఎంతైనా జనతా గ్యారేజ్ కంటే పెద్ద హిట్టు కొట్టాలి కదా.
అయితే ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఏమీ లేడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో పూరీ చేయబోయే సినిమాలో కాసేపు పిచ్చ రఫ్ అండ్ టఫ్‌గా ఫోర్స్డ్ లుక్‌తో కనిపిస్తాడట హీరో. ఇప్పుడు ఆ సీన్స్‌లో ఎలా కనిపిస్తే బాగుంటుందా అన్న ట్రయల్స్‌లో ఎన్టీఆర్ ఉన్నాడట. అందుకే గెడ్డం పెంచుతున్నాడని కూడా తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు రెండింటిలోనూ గెడ్డంతో కనిపించాడు ఎన్టీఆర్. అందుకే ఇఫ్పుడు చెయ్యబోయే కొత్త సినిమాలో కూడా కొన్ని సీన్స్‌లో అయినా గెడ్డంతో ఉండే సీన్స్ కొన్ని అయినా ఉండేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. తన సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలు రఫ్‌గా ఉంటేనే పూరీకి ఇష్టం. అందుకే ఎన్టీఆర్ ప్రపోజల్‌కి పూరీ కూడా వెంటనే సై అనేశాడట. వామ్మో…..బయట పడడం లేదు కానీ ఎన్టీఆర్, పూరీలు మామూలు ప్లానింగ్‌లో లేరుగా….ఈ సారి వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ పైన ఏ రేంజ్లో దండయాత్ర చేస్తారో చూడాలి మరి.