యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతోంది. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్‌ను డైరెక్టర్స్ రిజెక్ట్ చేశారని.. అసలు తారక్‌కు డైరెక్టర్స్ దొరకడం లేదని.. దీంతో అతడు మరికొంత కాలం వెయిట్ చేస్తాడని.. ఇలా ప్రతిఒక్కరు తారక్ గురించి సోషల్ మీడియాలో తోచింది రాసుకున్నారు. అయితే వీటని ఏమాత్రం పట్టించుకోని ఎన్టీఆర్.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తారక్ తన నెక్ట్స్ మూవీకి ఓ యంగ్ డైరెక్టర్‌ను ఫిక్స్ చేసుకున్నాడట.
నందమూరి కళ్యాణ్ రామ్‌కు పటాస్ వంటి కెరీర్ బెస్ట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడిని తారక్ తన నెక్ట్స్ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశాడట. అనిల్ చెప్పిన సబ్జెక్ట్ తనను చాలా బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు తారక్ పచ్చ జెండా ఊపేశాడట. అయితే ఇక్కడా.. తారక్-అనిల్ రావిపూడిలపై రకరకాల పుకార్లు మొదలెట్టేశారు సోషల్ మీడియాలో. అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీలో హీరో రామ్ క్యారెక్టర్ ఓ గుడ్డివాడిది అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఇదే స్క్రిప్ట్‌ను తారక్‌తో ఓకే చేయించుకున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అనిల్ రావిపూడి ఈ వార్తలను ఖండించాడు. తారక్‌కు వినిపించిన సబ్జెక్ట్ వేరే.. అందులో ఆయన పాత్ర వేరే అంటూ ఓ క్లారిటీ ఇచ్చేయడంతో.. వీరి కాంబినేషన్ దాదాపు ఖాయం అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఇరు వర్గాల నుండి ఓ క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే!