దీపం పరఃబ్రహ్మ స్వరూపం.దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు.సాధారణంగా పూజాసమయంలో రెండు దీపపుకుందులు వాడాలి.ఒకటి కూడా వాడవచ్చు.ప్రతి కుందిలో రెండేసి వత్తులు ఉండాలి.ప్రతిరోజూ కాలిన వత్తులు మిగిలిన నూనె తీసివేస్తూ ఉండాలి.కొంతమంది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నూనె వాడాలని అనుకుంటారు.పూజా మందిరంలో దీపారాధనకు ఒకే నూనె వాడటం మంచిది.దేవుళ్ళు ఎంతమంది ఉన్నా దీపం ఒక్కటే కదా!ఆవునెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైనది.ఇది రోజు వాడకానికి వీలుకాకపోవచ్చు.నువ్వులనూనె అందరు దేవుళ్ళకు మంచిది. మంగళకరమైనది. ఆరోగ్యకరమైనది.
పూజ సూర్యోదయం ముందు చేయాలా …తర్వాత చేయాలా అంటే మధ్యాహ్నంలోపున భోజనానికి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సూర్యోదయం లోపు యోగాసనాలు,స్నానం,ధ్యానం,స్తోత్రపాఠం,సూర్యోదయ వేళ సంధ్య,ఆదిత్యహృదయం పఠనం,సూర్యోదయం తర్వాత పూజ, నివేదన,మంగళహారతి ముగించి కుటుంబ సభ్యులకు తీర్ధప్రసాదాలు ఇవ్వాలి.