AP Cm Chandrababu naidu facing problems with his self mistakes. He is trying to highlight on Media. So wants to cover media with his speed decisions.
ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా, అభివృద్ధికి అందెలద్దిన సిఎంగా గుర్తింపు ఉన్నా ఇప్పుడు మాత్రం నవ్వుపాలవుతున్నారు. తత్వం బోధపడక చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి చివరకు మీడియాలో ఆయనను నవ్వుపాలుచేస్తోంది. రెండు టర్ములు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ ఏ అంశం మీద ఎలా స్పందిచాలో తెలియక జనాలకు లేని చర్చకు తావిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా బిజీగా ఉన్నారు. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోలిస్తే మాత్రం ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్కువే కష్టపడుతున్నారనుకోండి. కానీ మీడియాలో మాత్రం కేసీఆర్ కు దక్కుతున్న క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడుకు దక్కడం లేదు. ఇందుకు చంద్రబాబు చేసుకున్న స్వయంకృపరాధమే కారణం అని చెప్పుకోవచ్చు. అవును ఆ తొందరే ఆయనకు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఎన్నికైన నాటి నుండి కేసీఆర్, చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నారు. కేసీఆర్ తన రాష్ట్రం తెలంగాణలో మిగులు బడ్జెట్ కారణంగా కొత్తకొత్త పథకాలతో ముందుకు వెళుతున్నారు. ఏపిలో బడ్జెట్ లోటు కారణంగా దాన్ని పూడ్చేందుకు చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కోసంసర్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ క్రమంలో ఏపి ముఖ్యమంత్రిగా కొన్ని వందల సార్లు మీడియా ముందుకు వచ్చారు. తన ఊకదంపుడు ప్రసంగాలతో అందరిని పలకరించారు. కానీ పెద్దగా జనాలకు రీచ్ అయిన దాఖలాలుమాత్రం లేవు. కానీ కేసీఆర్ మాత్రం చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. దాంతో మీడియా కూడా ఫుల్ కవరేజ్ ఇస్తోంది.
ఇక రియో ఒలంపిక్స్ లో పివి సింధు గెలిచిన వెంటనే.. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి తానుచేసిన కృషి కారణంగానే పివి సింధులాంటి క్రీడాకారణి వచ్చింది అని గొప్పలు చెప్పుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడామాట్లాడలేదు. పైగా పివి సింధు, గోపీచంద్ లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎంతో సహాయపడింది అని చెప్పారు. పివి సింధును, పుల్లెల గోపీచంద్ లను కేసీఆర్ తన కార్యాలయంలో సత్కరించగా, చంద్రబాబు నాయుడు మాత్రం ఏకంగా ఓ పెద్ద సభపెట్టి హడావిడి చేశారు. పైగా పివి సింధుతో ఆయన బ్యాడ్మింటన్ ఆడటం చాలా మందికి నవ్వుతెప్పించింది.
ఇలా అన్నింటా ప్రజల ముందు తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు నవ్వుపాలవుతున్నారు. తాజాగా పెద్ద నోట్ల నిర్ణయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చెయ్యగానే వెంటనే హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి.. తాను రాసిన లేఖ వల్లే మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు అని బీరాలుపలికారు. కానీ రెండు రోజుల తర్వాత జనాలు లైన్లో నిల్చోలేక మోదీని, పనిలో పనిగా బాబును కూడా తిట్టుకుండటంతో బాబు డైలమాలో పడ్డారు. దాంతో ఇది తన సర్వీస్ లోనే అతి పెద్ద కష్టం అని అన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ సిఎం కేసీఆర్ చాలా కూల్ గా డీల్ చేశారు. మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ప్రజల కష్టాల మీద కేసీఆర్ దిల్లీలో రిపోర్ట్ చేశారు. తమ రాష్ట్రానికి చిల్లర పంపించాలని లేఖ కూడా రాశారు. ఇలా ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు క్రెడిట్ కోసం చూస్తూ చివరకు నలుగురు నవ్వుకునేలా మారారు. అయినా అన్ని తెలిసిన బాబుగారు కూడా ఇలా చేస్తున్నారేంటి? అనుకునేవాళ్ల జాబితా అంతకంతకు పెరుగుతోంది.