Newsనా హింట్ క్యాచ్ చేయలేకపోయారంటున్న సమంత

నా హింట్ క్యాచ్ చేయలేకపోయారంటున్న సమంత

గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. కానీ వాళ్ళందరిలోకి సమంతా…..సంథింగ్ కాదు…చాలా చాలా డిఫరెంట్. మిగతా వాళ్ళందరూ ఇక్కడ సినిమాల్లో నటించి ఎంతగా క్యాష్ చేసుకుందామా? అని ఆలోచించిన వాళ్ళే కానీ తెలుగు సినిమా పరిశ్రమలో భాగం కాలేకపోయారు. కానీ సమంతా మాత్రం ఇక్కడ వాళ్ళతో పూర్తిగా కలిసిపోయింది. పవన్, మహేష్, ఎన్టీఆర్‌లు సమంతాకు చాలా క్లోజ్. వాళ్ళ ఫ్యామిలీస్‌తో కూడా అంతే క్లోజ్‌గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏకంగా అక్కినేని వారి ఇంటి కోడలవుతోంది.

అయితే సాక్షి మీడియాతో మాట్లాడుతూ తన ప్రేమకథను స్వయంగా బయటపెట్టేవరకూ ఎవరూ కూడా సమంతా-చైతన్యల లవ్ స్టోరీని బయటపెట్టలేకపోయారు. ఇప్పుడీ విషయం గురించే మాట్లాడుతోంది సమంతా. తెలుగు మీడియాకు నేను కొన్ని హింట్స్ కూడా ఇచ్చానని చెప్తోంది. ఇంటర్యూస్‌లో మీతో కలిసి వర్క్ చేసిన హీరోల గురించి ఒన్ వర్డ్‌లో చెప్పండి అని అడిగినప్పుడు ‘ఏమాయ చేశావో’ హీరో చైతన్య గురించి చెప్తూ ‘మై ఫస్ట్ లవ్’ అని చెప్పేదట. అయితే ఆ హింట్‌ని ఎవరూ క్యాచ్ చేయలేకపోయారని చెప్తోంది సమంతా. ఏదైనా మాటలతో మాయ చేయడంలో మాటల మాంత్రికుడి స్నేహం ఈ ఏమాయ చేశావే బ్యూటీకి బాగానే కలిసొచ్చినట్టుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news