తెలుగు హీరోయిన్స్ అంటే ఎలా ఉండాలి? సారీ…ఈ ప్రశ్న కరెక్ట్ కాదు. పరభాషల నుంచి వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్న హీరోయిన్స్ అంటే ఎలా ఉండాలి? కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్స్‌ని నిర్మాతల ముక్కుపిండి వసూలు చేయాలి. ఆ హీరోయిన్స్‌తో పాటు వచ్చే అమ్మ, ఇంకా బోలెడుమంది స్టాఫ్‌కి ఫ్లైట్ టిక్కెట్స్ చూసి నిర్మాతకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి. ఇక కేరవాన్లు, ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ ఐటెమ్స్, ఎక్కడెక్కడి నుంచో జ్యూస్‌లు, అలాగే వాళ్ళ షాపింగ్ బిల్లు గట్రా చూసి ఆ సినిమాకు వర్క్ చేసిన యూనిట్ మొత్తం కూడా షాకయి షేకయి పోవాలి. అసలు ఆ హీరోయిన్ని చూస్తేనే భయపడిపోవాలి. కానీ అలాంటి వాళ్ళందరిలోకి రాశిఖన్నా మాత్రం సంథింగ్ స్పెషల్‌గా అనిపిస్తోంది.
ఓ ఇరవై రోజుల క్రితం రామానాయుడు స్టూడియోలో హైపర్ సినిమా తాలూకూ ప్యాచ్ వర్క్‌ని షూట్ చేస్తూ ఉన్నారు. రామ్, రాశిఖన్నాలకు సంబంధించిన సీన్స్‌ని షూట్ చేస్తూ ఉన్నారు. ఆ షూటింగ్ జరిగినంతే సేపూ కూడా ఓ మామూలు కారులో కూర్చుని వెయిట్ చేసింది రాశిఖన్నా. సెట్స్‌కి చాలా దగ్గరలోనే, డైరెక్టర్ పిలుపు వినిపించేంత దగ్గరలోనే చాలా సేపు ఉంది. అలాగే సినిమా ప్రమోషన్స్‌లో కూడా పూర్తిగా సపోర్ట్ చేసింది. ఇంతకుముందు కూడా రాశిఖన్నా ఇంతే సింపుల్‌గానే ఉండేదని ఆమెతో వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో జరగబోయే ఛారిటీ ప్రోగ్రాం కోసం కేవలం $6000లు మాత్రమే డిమాండ్ చేసింది రాశిఖన్నా. అలాదే తనతో పాటు తన ఇద్దరు అసిస్టెంట్స్‌కి కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్స్ అడిగిందట. సుప్రీం లాంటి సూపర్ హిట్, ఇప్పుడు హైపర్‌లో కూడా తన గ్లామర్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసిన రాశిఖన్నా ఇంత సింపుల్‌గా ఉండటమంటే గొప్ప విషయమే మరి. కాదు కాదు……చాలా అరుదైన విషయం. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లో కూడా మంచి టాలెంట్, అలాగే డబ్బు కోసం పీడించుకు తినకుండా మంచిగా ఉంటున్న రాశిఖన్నా లాంటి వాళ్ళను మన ప్రొడ్యూసర్స్ కూడా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని మనమూ కోరుకుందాం.