పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడో నంబర్ ఒన్ అయి ఉండేవాడు. కానీ పవన్ స్టైలే వేరు. అలాగే దర్శకులను ఎంచుకునే విధానం, ఆ సినిమా కోసం తీసుకునే హీరోయిన్స్, టెక్నీషియన్స్ ఎంపిక అంతా కూడా ఏదీ మార్కెట్ లెక్కల ప్రకారం ఉండదు.
పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్‌కి కూడా కారణాలు అవే. సిినిమా స్టార్ట్ అయ్యాక కూడా బోలెడన్ని మార్పులు చేశాడు పవన్. అన్నీ కలిసి సినిమాను దెబ్బేశాయి. ఇప్పుడు కాటమరాయుడు కథకు కూడా ఓ కొత్త రైటర్ కం డైరెక్టర్ యాడ్ అయ్యాడని తెలుస్తోంది. అలాగే ఈ మధ్య కాలంలో కాటమరాయుడు సినిమా నుంచి బోలెడంత మంది టెక్నీషియన్స్ బయటకు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన రైటర్ కం డైరెక్టర్ జోష్, కృష్ణాష్టమి లాంటి కళాఖండాలను రాసిన తీసిన వాసూవర్మనట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? ఈ రైటర్ కం డైరెక్టర్ అసలు పవన్ ఇమేజ్‌ని నిలబెట్టేస్థాయిలో రాయగలడా? అసలు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక మార్పులు చేర్పులు ఏంటి? ఏంటో పవన్ సేం టు సేం సర్దార్ రూట్లోనే మరోసారి వెళ్తున్నాడేమో అని అనిపిస్తోంది.