ఎన్నోభారీ అంచనాలతో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ .. ఆ అంచనాలను నిలబెట్టుకొని 50 కోట్ల క్లబ్ లోకి 4వ రోజునే చేరిపోయింది.. బాహుబలి సినిమా తర్వాత జనతా గ్యారేజ్ మిగతా సినిమాలను పక్కకునెట్టి 2 వ స్థానాన్ని ఆక్రమించింది . అంతే కాదు వరుసగా ఒకే సంవత్సరంలో 50 కోట్ల షేర్ క్లబ్ లోకి చేరిన ఒకే ఒక్క హీరో గా ఎన్టీఆర్ టాలీవుడ్ రికార్డ్స్ పుటల్లోకి ఎక్కాడు. వరుసగా 3 సినిమాల విజయం సాధించడం తో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అంతే కాదు రివ్యూస్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా జనతా గ్యారేజ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 4 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింద చూడగలరు.
వరల్డ్ వైడ్ షేర్ :
ఏపీ / తెలంగాణ : 35.7 కోట్లు
కర్ణాటక : 6.0 కోట్లు
కేరళ : 1.5 కోట్లు (మలయాళం)
తమిళనాడు / ROI :1.9 కోట్లు
అమెరికా : 5.6 కోట్లు
ROW: 1.1 కోట్లు
మొత్తం షేర్ : 51.8 కోట్లు
మొత్తం గ్రాస్ : 70 కోట్లు +