అవును ఆయన దేవుడినే మించిన గొప్పోడు. ఎంత గొప్పోడంటే.. ఆయనెప్పుడు వస్తే అప్పుడే దర్శనమించేంత. ఇదంతా తిరుమల తిరుపతి దేవదేవుడి గురించే. ఇందులో దేవుడు వెంకన్నస్వామి అయితే గొప్పొడు ముఖేష్ అంబానీ.
తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి బుధవారం అర్థరాత్రి తిరుపతికి వచ్చారు. పైకి వెళ్లడానికి రాత్రి ఒంటిగంట టైమ్ లో అలిపిరి గేట్లను ఓపెన్ చేశారు. నిజానికి అక్కడ ప్రతిరోజురాత్రి 12గంటల నుంచి 3గంటల వరకు టోల్ గేట్ మూసి ఉంటుంది. అయినా వచ్చింది అల్లాటప్పొడు కాదు కదా.. అందుకే మన అధికారులకు పెద్దగా రూల్స్ కనబడలేదు. అయినా రూల్స్ సామాన్యులకోసమే కానీ.. గొప్పొళ్ల కోసం కాదు కదా. అందుకే దర్జాగా రూల్స్ బ్రేక్ చేసి అర్థరాత్రి గేట్లు తెరిచి మరీ తిరుమలకు ముఖేష్ ను పంపారు.
ఇప్పటికే తిరుమలలో వీఐపీ కల్చర్ పై చాలా విమర్శలున్నాయి. సామాన్యభక్తుల్ని పట్టించుకోకుండా వీఐపీలకే పెద్దపీఠ వేస్తారన్నది అందరికీ తెలిసిందే. దేవదేవుడు క్రమంగా గొప్పోళ్లకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లు పోతే ఆ దేవుడు గొప్పోళ్ల స్వాధీనమైపోతాడేమో అన్పిస్తోంది. నిజానికి ఇప్పటికే ఆపరిస్థితి కనిపిస్తోంది. దేవుడికే దేవుడు అంబానీ దర్జాగా రెడ్ కార్పెట్ స్వాగతంతో తెల్లవారుఝామునే స్వామివారికి హాయ్ చెప్పి ఎంచక్కా వెళ్లిపోయాడు.