Moviesఎన్టీఆర్ .. కొరటాల శివ... మీరు సూపర్ ఎహె!!

ఎన్టీఆర్ .. కొరటాల శివ… మీరు సూపర్ ఎహె!!

‘నేచర్’ అంటే ఏంటి? చెట్లు చేమలూ ఆకులు అలమలూ జంగిల్ బుక్ లో ఉండే జంతువులు కాదు.. మొత్తంగా భూమి అంతా కలిపే నేచర్. కాని చాలా తెలివిగలవాడైన మనిషి.. ఈ ప్రపంచాన్ని చాలా విధాలుగా నాశనం చేస్తున్నాడు. అందుకే యునెస్కో వంటి ఎన్నో సంస్థలు ఎలాగైనా పుడమిని కాపాడాలని చాలా ప్రయత్నాలే చేస్తుంటాయి. వీళ్ళే కాకుండా చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు.. పరిరక్షకులు ఎన్నోవిధాలుగా భూమిని బాగు చేయాలని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఒక పాయింట్ నే ”జనతా గ్యారేజ్” లో టచ్ చేశాడు కొరటాల. ఓవరాల్ గా సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ఒక నేచర్ లవర్ గా ఎన్టీఆర్ పలికిన కొన్ని డైలాగులు మాత్రం అదిరిపోయాయ్.  ”మనం ఈ భూమి మీద జస్ట్ టెనెంట్స్ (అద్దెకుండే వారం).. తరువాత తరానికి మనం దీనిని జాగ్రత్తగా అప్పజెప్పాలి” అనే మీనింగులో ఒక డైలాగ్ హృదయాన్ని టచ్ చేసింది. అలాగే “నీ.. నా కాదు.. మనం – మనందరిది” అనే పాయింట్ కూడా బాగా చెప్పించాడు.

ఇక రచయిత ఎంత ఫీల్ ఉన్న సబ్జెక్టు తీసుకున్నాగాని దానికి సంపూర్ణ న్యాయం చేయగలిగే నటుడు లేకపోతే ఆ పాయింట్ ప్రేక్షకుల్లోకి అంత ఈజీ గా వెళ్ళదు. ఎటువంటి ఫీల్ ఉన్న డైలాగే అయినా సరే దానికి సంపూర్ణ న్యాయం చేయగలిగే అతి తక్కువ నటుల్లో ఎన్టీఆర్ ఒకడు అది వేరే చెప్పనక్కరలేదు. మాస్ సినిమా అంటూ కత్తి పట్టే సన్నివేశాలు ఎన్నైనా రాయించుకోవచ్చు… కానీ.. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేచర్ కి ఉన్న ప్రాముఖ్యత ని కూడా అభిమానులకి తెలియచేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ కి ఉంది. దానికి తగ్గట్లు కథ కుదిరింది. మంచి డైలాగులు.. మంచి సన్నివేశాలు.. ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. ఆ డైలాగులు చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు.

ఎన్టీఆర్ మరియు కొరటాల శివ లకి ఇంత మంచి సబ్జెక్టు ని తీసుకున్నందుకు ధన్యవాదాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news