Moviesషాకింగ్ : అనుష్క కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టారు......

షాకింగ్ : అనుష్క కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టారు… ఎక్కడో తెలుసా ?

పిల్ల జమీందార్ ఫేమ్ డైరెక్టర్ అశోక్.. ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో భాగమతి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారట. 4.5 కోట్లకు పైగా ఖర్చు కేవలం ఈ ఒక్క సెట్ కోసమే వెచ్చిస్తోందట నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. 400 ఏళ్ల క్రితం పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ఈ సెట్ ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇది పీరియాడికల్ చిత్రం కాదని.. సామాజిక చిత్రమేనని మేకర్స్ గతంలో చెప్పినా.. కీలకమైన ఓ సన్నివేశం కోసం మాత్రం ఈ సెట్ అవసరం ఉంటుందని తెలుస్తోంది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర స్వీటీ సినిమాలు పెద్దగా పెర్ఫామ్ చేయని సిట్యుయేషన్స్ లో.. ఈమెపై ఇంత భారీగా వెచ్చించడమంటే చాలా రిస్క్ అంటున్నారు సినీ జనాలు. ఒక్క సెట్ కోసమే 5 కోట్లు పెడితే.. మొత్తం సినిమాకి వీళ్లు కేటాయించిన బడ్జెట్ ఎంతో అని మాట్లాడేసుకుంటున్నారు. టూ మచ్ అనిపిస్తోంది కదూ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news