Moviesచైతన్య, అఖిల్ పెళ్లిళ్లపై మొదటిసారిగా స్పందించిన నాగార్జున!!

చైతన్య, అఖిల్ పెళ్లిళ్లపై మొదటిసారిగా స్పందించిన నాగార్జున!!

తన వారసుల పెళ్లిపై ఫస్ట్ టైమ్ స్పందించారు నాగార్జున. నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు నాగార్జున. ఇందులోనే విలేఖరుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

చైతన్య, అఖిల్ పెళ్లిళ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు నాగార్జున. పెళ్లి అనేది చాలా గుడ్ టైమ్ లో చేయాలని.. అలాంటి టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానన్నారు నాగ్.

        ఇప్పటికే నాగచైతన్య, సమంతల లవ్ ఎఫైర్ గురించి అందరికీ తెలిసింది. ఇటీవల ఓ ఫంక్షన్ లో కూడా ఇద్దరు కలిసిఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక అఖిల్ కూడా శ్రీయ అనే ఫ్యాషన్ డిజైనర్ లవ్ లో పడ్డాడు. వీళ్లిద్దరి లవ్ కు కూడా నాగ్ దంపతులు ఇప్పటికే ఓకే చెప్పారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news