ప్రజాధనాన్ని మంచినీరులా ఖర్చు చేయడంలో లీడర్లను మించినవారు ఉండరు. ప్రజా సంక్షేమం సంగతి దేవుడెరుగు.. వాళ్ల సంక్షేమం మాత్రం చాలా బాగా చూసుకుంటారు.పావలా ఖర్చు పెట్టి రూపాయి పావలా వసూలు చేస్తారు. ఈ విషయమంతా తెలిసిందే అంటారా..? అయితే ఈ విషయం చదివితే మాత్రం.. ఇంతలా కక్కుర్తి పడతారా..? అనుకుంటారు.
మొన్న ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు.. చాయ్, సమోసాలు, గులాబ్ జామ్ ల కోసం 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని ఏదో ఘనకార్యంచేసినట్టు నిండు అసెంబ్లీలో ప్రకటించారు సీఎం అఖిలేష్ యాదవ్. వీళ్లు ఖర్చు చేసింది కూడా జనం పేరు చెప్పుకునే. తమను కలవడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజలకు చాయ్, సమోసా, గులాబ్ జామ్ పెట్టామని.. ఖజానా నుంచి కాసులు వసూలు చేసుకున్నారు.
పక్కనే ఉన్న యూపీ వాళ్లే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుంటే… దేశరాజధానిని ఏలుతున్నాం మేమేం తక్కువా..! అనుకున్నట్టున్నారు ఆమ్ ఆద్మీపార్టీ నేతలు. అయితే.. యూపీ మంత్రుల కంటే ఢిల్లీ వాళ్లు కాస్త బెటర్. ఏడాదిన్నరలో కేవలం కోటి రూపాయలు మాత్రమే చాయ్ సమోసాలకు ఖర్చు చేశారట. ఇందులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి వాటానే ఎక్కువ.
డబ్బులా..? సమోసాలా..? సమోసాల కోసం 9 కోట్ల ఖర్చు!!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి