నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందన్నట్టు… దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. తెలుగులోకి డబ్బింగ్ చేసిన తమిళ సినిమాల్లో కూడా లేని ట్విస్ట్ లు బాబుగారి లైఫ్ ను రంగులమయం చేసేశాయి. రాజకీయాల్లో చాలా వ్యవహారాలు చూసిన, చేసిన బాబు.. ఓ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఇరుక్కుపోయారు. కొంతకాలంగా చడీచప్పుడు లేకపోవడంతో లోలోపల సెటిల్మెంట్ అయిపోయింది. ఇక కేసు క్లోజ్ అయినట్టేనని అంతా అనుకున్నారు.
కానీ.. బాబు ఇందులోంచి తప్పించుకునే దారి కనిపించడం లేదు. ఇప్పటికే చార్జీషీట్ లో బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇక… బాబుది ఈకేసులో గెస్ట్ రోల్ కాదని.. మెయిన్ రోల్ ఆయనదేనని.. ఆయనగారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాల్సిందేనని వైసీపీ లీడర్ వేసిన కేసుతో బాబులో దడ మొదలైంది. ఇటు కేసీఆర్ కూడా.. నన్ను ఇన్వాల్వ్ చేయవద్దు మీ పని మీరు చేసుకుపోండి అని ఏసీబీ అధికారులకు చెప్పారట. దీనికోసమే ఎప్పుడూ లేనిది రెండు గంటలకు పైగా గవర్నర్ తో డిస్కస్ చేశారట.
ఇంతవరకు సినిమా బాగానే నడిచినా… ఇకపై ఏం జరుగుతుందనేదే ఈ పొలిటికల్ ఎంటర్ టైనర్ లో అసలు ట్విస్ట్. ఎఫ్ఐఆర్ లో బాబు పేరు చేర్చితే.. ఆయనను అరెస్ట్ చేస్తారా..? ఓ సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారా..? ఒకవేళ అరెస్ట్ చేసినా.. బాబుగారు ఊరుకుంటారా..? అనేవి తెలియాంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..!