ఎన్టీఆర్ కేరీర్ లోనే జనతా గ్యారేజ్ ట్రెండ్ సెట్ చేసిందనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఈ మూవీ సౌత్ ఇండియా మొత్తం ఇరగదీయబోతోంది. అదీ అల్లాటప్పాగా కాదు. గత తెలుగుసినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ. ముఖ్యంగా తమిళనాడు విషయంలో ఈసారి బుడ్డోడు దూకుడుమీదున్నాడు. అక్కడ ఒకేసారి వందకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఇది రికార్డే. గతంలో బాహుబలి మాత్రమే ఈ స్థాయిలో రిలీజైంది. అందునా తమిళనాడులో మన దగ్గర కంటే చాలా తక్కువ థియేటర్లు ఉంటాయి. చెన్నైలోని SRM యూనివిర్శిటీలో టీడీపీ యువసేన టిక్కెట్స్ ను వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొన్న స్టూడెంట్స్ వేలరూపాయలు పోసి టిక్కెట్స్ కొన్నారు. ఇంత రెస్పాన్స్ వస్తుందని నిర్వాహకులే అనుకోలేదంట.
ఇక ఫస్ట్ టైమ్ మళయాలంలోనూ జూనియర్ మూవీ దూసుకుపోతోంది. మోహన్ లాల్ ఈమూవీలో నటించడంతో.. లోకల్ సినిమా రేంజ్ లో అక్కడ గ్యారేజ్ రిలీజ్ అవుతోంది. సమంతా, నిత్యామీనన్ లు కూడా అక్కడివాళ్లకు పరిచయమే కాబట్టి ఓపెనింగ్స్ కూడా బారీగానే రావొచ్చని ఇండస్ట్రీ అంచనా. అటు కర్నాటకలోనైతే పరిస్థితి చెప్పనక్కర్లేదు. అక్కడి మ్యాగ్జిమమ్ థియేటర్లు జనతా గ్యారేజ్ వే. ఇక ప్రిమియంషోలది అదే పరిస్థితి. అక్కడి థియేటర్ల ముందు కట్టిన బ్యానర్లు, సందడి చూస్తే.. జనతా గ్యారేజ్ రికార్డులు కొల్లగొట్టడం గ్యారెంటీ అన్పిస్తోంది. మూవీకి పాజిటీవ్ టాక్ వస్తే.. సౌత్ లో జూనియర్ పాగా వేసినట్లే.