ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం బాబుకు తిప్పలు తప్పేలా లేవు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయినా.. ఏపీలో ప్రతిపక్షం వైసీపీ మాత్రం వదిలేలా లేదు. ఆపార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. కేసును పునర్విచారణ చేయలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆడియో టేపుల్లోని ఏపీ సీఎం చంద్రబాబు వాయిస్ పై విచారణ జరపాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. సెప్టెంబర్ 29లోపు పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఏసీబీ కోర్టు తీర్పుతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై తెలంగాణ సర్కార్ యాక్టీవ్ గా లేకపోవడం.. అదనపు చార్జిషీట్స్ వేయకపోవడంతో వైసీపీనే రంగంలోకి దిగింది. ఆర్టీఐ చట్టం కింద కేసుకు సంబంధించిన డీటైల్స్ మొత్తం సేకరించింది. పూర్తి ఆధారాలతో కోర్టు మెట్లెక్కింది. కోర్టు పునర్విచారణకు ఆదేశించిండంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కే చాన్స్ ఉంది. కేసును ఇక్కడిదాకా తీసుకురాగలిగిన జగన్.. ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికైతే ఆపార్టీ నేతలు ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.