హైదరాబాద్ లో తెల్లవారుఝామున బాలయ్యకారుకు ప్రమాదం జరిగింది. ఉదయం బసవతారకం దగ్గర వేగంగా వస్తూ పోల్ ను ఢికొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. AP02 AY0001నెంబర్ గల ఫార్చునర్ కారు అతివేగంగా వచ్చి ఢికొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే అందులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారు బాలకృష్ణ పేరుపై రిజిస్టర్ అయ్యి ఉంది.