నిహారికకు హీరోయిన్ అవ్వాలని ఎప్పటినుంచో కల. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చినా కూడా హీరోయిన్స్‌కి ఛాన్స్ లేదని నిహారికకు తెలుసు. బాలీవుడ్లో అయతే స్టార్ వారసులు హీరోలవుతారు. వారసురాండ్రు హీరోయిన్స్ అవుతారు. కానీ తెలుగులో మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. ఇంతకుమందు కృష్ణ కూతురు మంజుల ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా నిహారికకు తెలుసు. అందుకే ముందు టీవీ షోస్‌తో స్టార్ట్ చేసింది. నాగబాబు జడ్జ్‌గా ఉన్న జబర్ధస్త్ స్పెషల్ ఎపిసోడ్‌తో తను ఏ రేంజ్లో యాక్ట్ చేయగలదో అందరికీ అర్థమయ్యేలాగా చేసింది. తన ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చాలా తెలివిగా, జాగ్రత్తగా ఒప్పించింది. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్‌లో కూడా మరీ వ్యతిరేకత రాకుండా ఉండేలా తన వరకూ చాలా బాగా కనిపించేలాంటి సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకుంది. మల్లెల తీరం లాంటి డీసెంట్ ఫిల్మ్ తీసిన రామరాజుతో మరోసారి అలాంటి సబ్జెక్టునే ట్రై చేసింది. ఎక్కడా విమర్శలు రాకుండా ఉండేలా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా తన మదర్నే సెలక్ట్ చేసుకుంది. అంతా కరెక్ట్‌గానే ప్లాన్ చేసింది కానీ సినిమా రిజల్ట్ మాత్రం నిహారికకు భయంకరమైన షాక్ ఇచ్చింది. మరోవైపు కొన్ని వెబ్ సైట్స్ కూడా నాగశౌర్య, నిహారికల గురించి బుద్ధిలేని రూమర్స్ ప్రచారం చేయడంతో పూర్తిగా డీలా పడిపోయింది నిహారిక.
అయితే మెగా హీరోలు చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ఈ సారి నిహారిక బాధ్యతను తీసుకున్నారు. ఎలా అయినా తనను కూడా హీరోయిన్గా నిలబెట్టాలని ఫిక్స్ అయ్యారు. కొన్ని సినిమాల్లో అయినా హీరోయిన్గా చేస్తే తనూ హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆలోచించారు. అందుకే మరాఠాలో సూపర్ హిట్ అయిన హ్యాపీ జర్నీ సినిమాను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బెక్కం వేణుగోపాల్ లాంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ చేత ఆ సినిమా రైట్స్ కొనిపించారు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్‌తో ఆత్మ బ్యాక్ డ్రాప్లో నడిచే ఆ సినిమా ట్రెండీగా ఉంటుందనడంలో సందేహం లేదు. మోరోవర్ నిహారికకు టైలర్ మేడ్ క్యారెక్టర్లా ఉంటుంది. బ్రదర్ క్యారెక్టర్ కెోసం హర్షవర్ధన్ రాణేను ఫైనల్ చేశారు. నిహారికతో యూట్యూబ్ సిరీస్‌లకు వర్క్ చేసిన డైరెక్టర్ని ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సినిమాలో చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుని మరోసారి హీరోయిన్గా ట్రై చేస్తున్న నిహారిక ఈ సారి మాత్రం గ్యారెంటీగా సక్సెస్ అవ్వాలని మనమూ కోరుకుందాం. నిహారిక లాంటి వాళ్ళు సక్సెస్ అయితే హీరోయిన్స్‌గా మన తెలుగమ్మాయిలు చాలా మంది ధైర్యంగా ప్రయత్నాలు చేస్తారు.