Uncategorizedఅదీ జూనియర్ గొప్పతనం.. హ్యాట్స్ ఆఫ్ టూ ఎన్టీఆర్!!

అదీ జూనియర్ గొప్పతనం.. హ్యాట్స్ ఆఫ్ టూ ఎన్టీఆర్!!

ఎన్టీఆర్… మోహన్ లాల్ ఈ ఇద్దరూ కలిసి నటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు.ఇలాంటి కాంబినేషన్ ఒకటి స్క్రీన్ మీదికి వస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా ఇంతవరకూ ఎవ్వరికీ రాలేదు. జనతా గ్యారేజ్ సినిమాలో ఈ ఇద్దరి కాంబినేషన్ అందరినీ ఇప్పుడు అలరిస్తోంది. మోహన్ లాల్ విలక్షణ నటుడు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో. ఈ ఇద్దరి మధ్యా సన్నివేశాలు అంత బాగా పండుతాయని ఊహించిన దర్శకుడు కొరటాల శివకు ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇంకోటీ… మలయాళ నటుడికి తెలుగు సినిమాలో అంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా మెచ్చుకోవాలి.

జనతా గ్యారేజ్ చిత్రం మొదలైన దగ్గర నుంచే మోహన్ లాల్ పట్ల తమకు ఉన్న మర్యాదనూ గౌరవాన్నీ కనబరుస్తూ వచ్చింది చిత్ర యూనిట్. నిజానికి మనకు మోహన్ లాల్ కొత్త. ఆయన మలయాళంలో టాప్ స్టార్ అయినా కూడా తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటుడు అని చెప్పాలి. ఇక తారక్ మనకు టాప్ హీరో. అయినా సరే సినిమా టైటిల్స్ లో ముందుగా మోహన్ లాల్ పేరు వేయడం మెచ్చుకోదగ్గది. సినిమాలో కూడా ప్రథమార్థం మోహన్ లాల్ పాత్ర డామినేషన్ ఉంటుంది. ద్వితీయార్థంలో తారక్ రంగంలోకి దిగినా కూడా ఆ పాత్రను మూలకి పడేశారు అనే ఫీలింగ్ ఎక్కడా కలుగకుండా దాని ప్రాధాన్యతను నిలుపుతూనే వచ్చాడు దర్శకుడు. పతాక సన్నివేశానికి వచ్చేసరికి మరోసారి మోహన్ లాల్ పాత్ర ప్రాధాన్యం అవుతుంది. సీనియర్ నటుడు మోహన్ లాల్ కి వచ్చిన గౌరవం అది. ముందుగా ఇక్కడ మెచ్చుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివలను. ఈ కాంబినేషన్ అనుకుని అనుకున్నది తెరమీదికి తెచ్చినందుకు ఆయన్ని మెచ్చుకోవాలి.

అంతే కాదు తన ఇమేజ్ బ్యాగేజ్ మోయకుండా తన వదిన పాత్ర వేసిన విదిషా చేతిలో చెంప దెబ్బ తినటం కూడా… ఎన్టీఆర్ కి కథ, కథనాల మీద ఉన్న గౌరవాన్ని తెలియచేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news