భారీ చిత్రాల నిర్మాత గానే కాకుండా విజయవంతమైన ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించిన దిల్ రాజు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ ని మాత్రం చాలా పెద్ద మొత్తానికి కొనుగోలు చేశాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాన్నకు ప్రేమతో సినిమా నైజాం ఫైనల్ కలెక్షన్లు 11 నుండి 12 కోట్ల రూపాయలు.
కానీ ఇప్పుడు దిల్ రాజు కొన్న రేటు మాత్రం అందరిని పెద్ద షాక్ గి గురిచేస్తుంది. అక్షరాలా 17 కోట్ల రూపాయలకు నైజాం రైట్స్ కొన్నాడు. అంత దైర్యం ఏంటని అడుగుతుంటే తారక్ నా దైర్యం అని షాకింగ్ జవాబు చెప్పాడు. ఇంకా ఆయనమాటల్లోనే “నాకు తారక్ పై మరియు అతని స్టామినా మీద ఎంతో నమ్మకముంది. తారక్ కి ఒక్క కరెక్ట్ సినిమా చాలు గేమ్ మొత్తం మారిపోతుంది…. అన్ని ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి. జనతా గ్యారేజ్ అటువంటి కరెక్ట్ సినిమా అని నమ్ముతున్నాను. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది .” అన్నాడు.
అవును మరి.. తారక్ ఫుల్ ఫామ్ లో ఉండటమే కాకుండా రెండు వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దిల్ రాజు ఆ మాత్రం ధైర్యం చేయటం లో తప్పేమి లేదంటున్నాయి సినీ వర్గాలు.