Uncategorizedబూతు సినిమాలకే ముత్తాత ఈ మహా బూతు సినిమా!!

బూతు సినిమాలకే ముత్తాత ఈ మహా బూతు సినిమా!!

వల్గర్ కామెడీ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో వారానికి ఒకటి వచ్చేస్తున్నాయి. మొన్న మొన్నటి వరకూ వల్గారిటీ + కామెడీ మాత్రమె వచ్చేవి
గానీ సన్నీ లియాన్ రావడం తో హాట్ హాట్ కామెడీ పెరిగింది. శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చి క్రైమ్ లేదా కామెడీ కి ప్రాధ్యాన్యత తగ్గి అటూ
ఇటూగా బూతు సినిమాలు ఎక్కువ విడుదల అవుతున్నాయి. అయితే అందరికీ ముత్తాత లాంటి ఒక బూతు సినిమా ఇప్పుడు విడుదల కి సిద్దం అయ్యింది. XXX సినిమా విడుదల విషయం లో సెన్సార్ హడావిడి మామూలుగా లేదు. 2014 లోనే మొదలైన ఈ బూతులకే బూతు సినిమా కంప్లీట్ అయ్యే సరికి ఇంత టైం పట్టింది.

కైరాదత్ అనే అమ్మాయి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం సెన్సార్ కటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వారంతా షాక్ కి గురవ్వడం విశేషం. ఈ సినిమా ఏంటో ఈ బూతు వీడియో లు ఏంటో అంటూ వారు గొడవ గొడవ చేసారట. దాదాపు 60% సీన్లలో హీరోయిన్ న్యూడ్ గానే ఉంది.. దయచేసి రీ-ఎడిట్ చేసుకుని తీసుకురండి అన్నారట. అందుకే మొన్నామధ్యన ఉడ్తా పంజాబ్ విషయంలో సెన్సార్ బోర్డుతో ఎన్ని గొడవలైనా కూడా.. ఏక్తా కపూర్ కామ్ గా ఉంది. గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఈ సినిమాను ఆపేస్తారేమోనని ఆమెకు భయమేసి ఉంటుంది. మరి ఈ XXX కామెడీని ఎన్నిసార్లు రీ-ఎడిట్ చేసినా కూడా అది పూర్తిస్థాయి పోర్న్ ఫిలింకి దగ్గరగానే ఉంది కాని.. ”ఎ” సర్టిఫికేట్ ఇవ్వదగిన సినిమాగా లేదట. ఒకవేళ ఏమైనా ఎ++ వంటి రేటింగులు ఇండియాలో అమల్లోకి వస్తే.. అప్పుడు ఈ XXX రిలీజ్ అవుతుందేమో. అప్పటివరకు ఈ మహా పెద్ద బూతు సినిమాకు తిప్పలే తిప్పలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news