Moviesవిక్రమ్ ‘మిస్టర్ KK’ రివ్యూ & రేటింగ్

విక్రమ్ ‘మిస్టర్ KK’ రివ్యూ & రేటింగ్

సినిమా: మిస్టర్ KK
నటీనటులు: విక్రమ్, అక్షర హాసన్, అభి హాసన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ ఆర్ గుత్తా
సంగీతం: గిబ్రన్
నిర్మాతలు: అంజయ్య, శ్రీధర్
దర్శకత్వం: రాజేష్ ఎం సెల్వ

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ KK పై సర్వత్రా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మరోసారి తెలుగు, తమిళ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని సినీ జనాలు అంచనా వేస్తున్నారు. కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
మెడికో వాసు(అభి హాసన్) తన భార్య అతిరా(అక్షర హాసన్)తో కలిసి జీవిస్తాడు. ప్రెగ్నెంట్ అయిన అతిరాను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. వాసు పనిచేసే ఆసుపత్రిలో గాయాలతో అడ్మిట్ అయిన కేకే(విక్రమ్)ను తమకు అప్పగించాలని కిడ్నాపర్లు వాసును బెదిరిస్తారు. ఇంతకీ వాసు కేకేను ఎందుకు కాపాడాడు..? అసలు కేకే ఎవరు..? అతడి కోసం కిడ్నాపర్లు ఎందుకు వెతుకుతున్నారు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
చియాన్ విక్రమ్ సినిమా అంటే చాలా అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వెళతారు. ఇక మిస్టర్ KK సినిమా టీజర్, ట్రైలర్లు కూడా ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సినంత యాక్షన్ ఉందని తెలిపాయి. ఇక సినిమా కథ పరంగా ఫస్టాఫ్ మొత్తం వాసు, అతిరాల మధ్య రిలేషన్, అతిరాను కొందరు కిడ్నాప్ చేయడం.. ఆమెను తిరిగి అప్పగించాలంటే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కేకేను తమకు అప్పగించాలని వచ్చే బెదిరింపు కాల్స్‌తో వాసు డైలమాలో పడతాడు. కట్ చేస్తే.. కేకే ఎవరనే విషయం స్వయంగా తెలసుకోవాలని ప్రయత్నించే వాసుకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఆకట్టుకునే ట్విస్టులతో ఫస్టాఫ్‌ను పూర్తి చేశాడు దర్శకుడు. ఒక సింపుల్ ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.

ఇక సెకండాఫ్‌లో కేకే ఎవరనే విషయం రివీల్ చేసిన విధానం బాగుంది. ఆపై వరుసగా వచ్చే చేజింగ్ సీన్స్.. యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడు దర్శకుడు. అయితే యాక్షన్ డోస్ మరీ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతారు. సినిమాలో సెట్ కాని సంగీతం కూడా వారికి తలనొప్పిని తెప్పిస్తుంది. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని లాజిక్ లేని సీన్స్‌తో సదరు ప్రేక్షకుడికి సినిమా పూర్తిగా నచ్చదు.

ఓవరాల్‌గా కేవలం యాక్షన్ ప్రియులకోసం తెరకెక్కించిన మిస్టర్ KK సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే అలరించింది. ఏ క్లా్స్ ఆడియెన్స్‌ ఈ సినిమాను పూర్తిగా స్కిప్ చేస్తారు. సినిమాలో ఏదైనా చూడొచ్చు అంటే అది ఖచ్చితంగా చియాన్ విక్రమ్ యాక్షన్ పర్ఫార్మెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్:
మిస్టర్ KK సినిమాను కేవలం చియాన్ విక్రమ్ కోసమే చూడొచ్చు అనేలా దర్శకుడు తెరకెక్కించాడు. అల్ట్రా స్టైలిష్ విక్రమ్ ఈ సినిమాలో ఆధ్యంతం ఆకట్టుకున్నాడు. ఈ వయసులో కూడా మనోడు చేసే యాక్షన్ సీన్స్‌కు అందరూ ఫిదా అవుతారు. విక్రమ్ ఎక్స్‌ప్రెషన్స్‌, యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌ కడుపు నిండుతుంది. కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ ఈ సినిమాలో ఓ మంచి పాత్రలో నటించింది. ఆమె భర్తగా చేసిన అభి హాసన్ కూడా పర్వాలేదనిపించాడు. మిగతా వారు తమ పాత్రల మేర బాగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రాజేష్ సెల్వ రాసుకున్న కథ కేవలం యాక్షన్ ప్రియుల కోసమే అన్నట్లుగా తెరకెక్కించాడు. పూర్తిగా యాక్షన్, చేజింగ్‌లతో సినిమాపై ఇంట్రెస్ట్‌ను పోగొట్టాడు ఈ డైరెక్టర్. విక్రమ్‌ను కేవలం యాక్షన్ సీన్స్‌ కోసమే వాడుకున్నట్లుగా చూపించాడు. ఇక తాను చెప్పాలనుకున్న కథ పూర్తిగా సైడ్ ట్రాక్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్, చేజింగ్ సీన్స్‌ను బాగా హైలైట్ చేసి చూపించారు. నిర్మాణ విలువలు సూపర్. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు నిర్మాతలు. యాక్షన్, చేజింగ్ సీన్స్‌లో వచ్చే మ్యూజిక్ సినిమాలో కాస్త ఇంప్రెస్ చేసే అంశం అని చెప్పాలి.

చివరగా: మిస్టర్ KK.. జస్ట్ OK!
రేటింగ్: 2.5/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news