వాల్మీకిలో నటించినందుకు.. వరుణ్ షాకింగ్ కామెంట్!

Varun Tej On Acting In Valmiki Movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ వాల్మీకి అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తొలిసారి ఓ డిఫరెంట్ లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు. పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ నటన మరో లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.

తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఈవెంట్‌లో వరుణ్ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. తొలిసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని.. అదే విధంగా చాలా టెన్షన్‌గా ఉందని అన్నాడు. ఇప్పటివరకు తానుచేయని పాత్రను ఈ సినిమాలో దర్శకుడు హరీష్ చూపించారని వరుణ్ తెలిపాడు. వాల్మీకి లాంటి మాస్ సినిమాలో నటించేందుకు తనకు మెగాస్టార్ చిరంజీవి స్పూర్తినిచ్చాడని తెలిపాడు.

ఇక వాల్మీకి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ చిత్రం జిగర్తండాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్‌ ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే 20వ తేదీ వరకు ఆగాల్సిందే.

Leave a comment