Newsమనుష్యులకే కాదు పశువులకూ ఆధార్

మనుష్యులకే కాదు పశువులకూ ఆధార్

భారత కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆధార్ గుర్తింపు కార్డులు అప్పుట్లో పెద్ద దుమారమే రేపింది. కానీ నేడు అదే ప్రతి ఒక్కరి గుర్తింపుగా మారింది. ఏది కావాలన్నా ఆధార్.. ఏదీ చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారింది. అంతలా ఆధార్ గుర్తింపు కార్డును జనాల్లోకి తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు బ్యాంకు లావాదేవీల నుండి ఫోను సిమ్ కార్డు నెంబర్ కొనాలంటే కూడా ఆధార్ తప్పనిసరిగా మారింది. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికే ధీటుగా వినూత్న ప్రయోగానికి నాంది పలికింది.

కేవలం మనుష్యులకే ఆధార్ ఉంటే సరిపోతుందా.. పాడిపశువులకు కూడా ఆధార్ గుర్తింపు కార్డు ఉంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన సమస్యలు సులభతరమవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏపీ రాష్ట్రంలోని ఆవులు, గేదెలకు ఆధార్ ఈ ట్యాగ్‌ను వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా చేపడుతున్నట్లు ఏపీ పశుసంవర్ధక శాఖ తెలిపింది.

ఈ విధానం ద్వారా దేశంలో ఎక్కడి నుండైనా పశువులను కొనుగోలు చేయవచ్చని.. ఈనాఫ్ ఆధార్ నెంబర్ అనుసంధానం ద్వారా పశువులకు ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య సదుపాయం కల్పించనుంది. పశువులకు వేసే ట్యాగుల ద్వారా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని.. వాటి ఆరోగ్యం, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందనే విషయాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఒకవేళ పాడిపశువులు అపహరణకు గురైనా అవి ఎక్కడున్నాయనే విషయం సులువుగా తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news