Gossipsబిగ్ బాస్3 లో సెలబ్స్ వీరే..!

బిగ్ బాస్3 లో సెలబ్స్ వీరే..!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు మూడో సీజన్ కి ముస్తాబవుతుంది. అయితే మొదటి సీజన్ కి ఎన్టీర్, రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు మూడో సీజన్ కి ఎవరు అన్న విషయంపై తర్జన భర్జన జరుగుతున్నాయి..కింగ్ నాగార్జున ఫైనల్ అని అంటున్నారు. మరి ఈ విషయం మాత్రం అఫిషియల్ గా ప్రకటన రాలేదు.

తాజాగా ఇప్పుడు కొత్త న్యూస్ చక్కర్లు కొడుతుంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా నిర్వహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈసారి ప్రముఖ సెలబ్రిటీలను ఈ షోలోకి తీసుకోబోతున్నారట. ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఎంఇపిక చేసి సంప్రదింపులు జరుపుతున్నారట.

జబర్దస్త్ కమెడియన్ ఒకరు, ఫేమస్ సింగర్ , పాత సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన హీరోయిన్లు, సినిమాల్లో బాగా గుర్తింపు పొందిన నటీనటులను ఈ సారి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జబర్ధస్త్ నుంచి సుడిగాలి సుధీర్, హాట్ యాంకర్ రష్మిని సంప్రదిస్తున్నారని..టాలీవుడ్ హీరోలు కూడా ఎంట్రీ ఇస్తున్నారని..పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఉండబోతుందని ఇప్పటికే తెగవార్తలు వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news