Gossipsప్రేమికుడి చేతిలో మోసపోయిన తాప్సి !

ప్రేమికుడి చేతిలో మోసపోయిన తాప్సి !

టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సి గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ఆమె అందచందాలతో ప్రేక్షకుల మనస్సులో ఎప్పుడో స్థానం సంపాదించుకుంది. అయితే ఆమెకు ఇక్కడ చెప్పుకోదగిన హిట్టు రాకపోవడంతో ఆ తరువాత మకాం బాలీవుడ్ కి మార్చేసింది. అప్పుడప్పుడు తన చిలిపి మాటలతో ప్రేక్షకులను అలరించే తాప్సి ఈసారి మాత్రం తన చిన్ననాటి విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది.

అందరిని ఇలా ఆశ్చర్యంలో ముంచేసిన విషయాలు గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చింది.. ‘నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే ఒకబ్బాయితో ప్రేమలో పడ్డాను…కానీ పదోతరగతి పరీక్షలు వస్తున్నాయని… నన్ను అతను వదిలేశాడు.. ఆ తరువాత నన్నెందుకు వదిలేసావు అని పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి అడిగేదాన్ని.. ఏడ్చే దాన్ని…అంటూ స్కూల్ డేస్ లోని లవ్ ఎఫైర్ గురించి తాప్సి చెప్పింది.

అంతే కాదు … అప్పటి సంగతులు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తోంది’ అంటూ … సిగ్గుపడిపోతోంది. లేత వయసులోనే ఇంత ఘాటు ప్రేమా..? అమ్మో తక్కువదేమీ కాదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అప్పటి సంగతి సరే ఇప్పడు ఎవరిని ప్రేమిస్తున్నావు అంటూ… ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఆమె అభిమానులు చిలిపి ప్రశ్నలు వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news