Moviesశ్రీమతి 21F ట్రైల‌ర్‌: ప‌చ్చి బూతులు..

శ్రీమతి 21F ట్రైల‌ర్‌: ప‌చ్చి బూతులు..

టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ సినిమాల ప్రవాహం ఆగడం లేదు. కొన్ని మ‌రీ సీ గ్రేడ్ అంత‌కు మించిన నాసిర‌కం సినిమాలుగా వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి వ‌చ్చే చేరుతోంది శ్రీమ‌తి 21 ఎఫ్‌. కోలీవుడ్‌లో టార్చిలైట్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో శ్రీమతి 21 ఎఫ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇంత‌కు ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రో కాదు జ‌యం, అప‌రిచితుడు లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌దా కావ‌డం విశేషం.

అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 1న రిలీజ్ కానుండ‌గా…. ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఒక వేశ్య జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారట. 1990లో ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు బోర్డర్ దగ్గరలోని హైవేలో జరిగిన ఓ రియ‌ల్ స్టోరీ బేస్ చేసుకుని సినిమా తీశామ‌ని అంటున్నారు. వేశ్య‌లు రోడ్డు ప‌క్క‌న టార్చిలైట్లు వేసుకుని విటుల‌ను ఊరిస్తుంటారు. అందుక‌నే అక్క‌డ కరెక్ట్ టైటిల్ పెట్టారు.

సబ్జెక్ట్‌కు త‌గ్గ‌ట్టే ట్రైల‌ర్ నిండా ప‌చ్చిబూతులే ఉన్నాయి. బాగా బ‌రితెగించి మ‌రి న‌టించిన‌ట్టు ఉంది.
“జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?”.. “నువ్విచ్చే రెండు వందల రూపాయలకు నిన్ను రెచ్చగొట్టమంటావా?” ఇలా పూర్తిగా రెచ్చిపోయారు. ఇక ట్రైల‌ర్‌లోనే ఇది ఓ షార్ట్ ఫిల్మ్ రేంజ్ క‌న్నా హీనంగా ఉన్న‌ట్టు విజువ‌ల్స్ చెప్పేస్తున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోరు బీసీ కాలం నాటిది. ఈ ట్రైలర్ లో ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఆకట్టుకునేలా లేకపోవడం ఒక మేజర్ హైలైట్. ఈ ట్రైల‌ర్ స‌దా ఎలా రెచ్చిపోయి బ‌రితెగించిందో చూసేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news