Gossipsఅర్జున్ రెడ్డి పై శర్వానంద్ బయట పెట్టిన నిజాలు..

అర్జున్ రెడ్డి పై శర్వానంద్ బయట పెట్టిన నిజాలు..

తెలుగులో ఉన్న విలక్షణ నటులలో శర్వానంద్ ఒకరు. హీరోగా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న శర్వానంద్ పండుగ సీజన్ లో సూపర్ హిట్ కొట్టడం అలవాటుగా మారింది. ఈ దసరాకి ఓ పక్క ఎన్.టి.ఆర్ జై లవ కుశ, మరో పక్క మహేష్ స్పైడర్ వస్తున్నా మహానుభావుడు అంటూ వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు శర్వానంద్.

ఇక ఈ సినిమా హిట్ అయినందుకు సంతోషంలో ఉన్న శర్వానంద్ ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి మిస్ అవడం గురించి నోరు విప్పాడు. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అర్జున్ రెడ్డి కథ ముందు శర్వానంద్ దగ్గరకు వచ్చిందట అయితే ఆ సినిమా నిర్మించడానికి అశ్వనిదత్, లగడపాటి శ్రీధర్ లను అడుగగా ఆ సినిమా వర్క్ అవుట్ అవదని చెప్పారట.

నిర్మాతలు వెనక్కి తగ్గడంతో తాను ఆ సినిమా మిస్ అయ్యానని చెప్పాడు శర్వానంద్. అయితే తిరిగి తిరిగి సందీప్ వంగ తన సినిమాను తానే నిర్మించుకున్నాడు. ఇక రిలీజ్ తర్వాత అర్జున్ రెడ్డి సంచలనాలు తెలిసిందే. అయితే ఓ సూపర్ హిట్ బోల్డ్ మూవీ మిస్ అయిన శర్వానంద్ చెప్పిన కారణాలు చూస్తుంటె హిట్ సినిమా అయినా నిర్మాతలు నమ్మలేదని తెలుస్తుంది. శర్వానంద్ బయట పెట్టిన ఈ నిజం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news