Gossips2.ఓ టీజర్ పై శంకర్ షాకింగ్ ట్వీస్ట్.. మాటల్లేవంతే..!

2.ఓ టీజర్ పై శంకర్ షాకింగ్ ట్వీస్ట్.. మాటల్లేవంతే..!

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో వస్తుంది. ఇక కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా టీజర్ అఫిషియల్ డేట్ వచ్చింది. సెప్టెంబర్ 13 వినాయక చవితి సందర్భంగా 2.ఓ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వెళ్లడిస్తూ ఓ సర్ ప్రైజ్ పోస్టర్ వదిలారు చిత్రయూనిట్.

ఆ పోస్టర్ చూస్తే మాట్లాడటానికి ఇంకా ఏమి లేవు అన్నట్టుగా ఉంది. 2.ఓ టీజర్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. రజినికాంత్, ఎమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా ఈ ఇయర్ దీవాళికి ప్లాన్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా గ్రాఫిక్స్ వర్క్ తో రిలీజ్ పెండింగ్ పడుతూ వస్తున్న 2.ఓ మూవీ ఈసారి అనుకున్న టైం కు రిలీజ్ పక్కా అంటున్నారు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news