‘రయీస్’ ట్రైలర్‌తో చరిత్ర సృష్టించిన షారుఖ్.. కుదేలయిన బాలీవుడ్ రికార్డ్స్

shahrukh khan raees trailer break all youtube records in one day

Bollywood baadshah Shahrukh Khan latest movie Raees trailer creates history by breaking all youtube records in just one day. This movie directed by Rahul Dholakia. Nawazuddin Siddique playing police character and Pakistan beauty Mahira Khan romancing with Shahrukh.

షారుఖ్ ఖాన్ ఎంటరైతే.. రికార్డ్ బద్దలవ్వాల్సిందేనని బాలీవుడ్ జనాలు అంటుంటారు. అతని స్టార్‌డమ్ ముందు ఏ స్టార్ హీరో అయినా చిన్నబోవాల్సిందేనని విమర్శకులు సైతం చెబుతుంటారు. వాళ్ళు చెప్పే ఆ మాటలు అక్షరాల నిజమని కింగ్‌ఖాన్ మరోసారి నిరూపించాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘రయీస్’ ట్రైలర్‌తో చరిత్ర సృష్టించి.. గత రికార్డులను ఒకే ఒక్క రోజులో తుడిచిపడేశాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజమే. ఎంతోకాలం నుంచి అదిగో, ఇదిగో అంటూ నాన్చుతూ.. చివరికి బుధవారం (07-12-2016) మధ్యాహ్నం 12 గంటలకు రిలీజైన రయీస్ ట్రైలర్.. ఒక్క రోజులోనే గత యూట్యూబ్ రికార్డుల్ని కడిగిపారేసింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్లకుపైగా వ్యూస్ క్రాస్ చేసింది. ఇండియన్ చిత్రపరిశ్రమలో ఇంతవరకు ఏ ఒక్క టీజర్ ఒక్క రోజులోనే అన్నీ వ్యూస్ రాబట్టిన దాఖలాలు లేవు. దీంతో.. ఒకే రోజులో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్‌గా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఇక లైక్స్ పరంగా చూస్తే.. దిమ్మతిరగాల్సిందే. ఇంతవరకు ఎన్ని లైక్స్ వచ్చాయో తెలుసా.. 2.50 లక్షలకు పైగానే. కేవలం 24 గంటల్లోనే ఓ ట్రైలర్‌కి అన్ని లైక్స్ రావడం ఇదే తొలిసారి. కాబట్టి.. లైక్స్ పరంగానూ ఈ చిత్రం తన ఖాతాలో మరో రికార్డ్‌ని జమ చేసుకుంది. ఈ క్రెడిట్ మొత్తం షారుఖ్‌కే దక్కుతుందని, అతనికున్న విపరీతమైన క్రేజ్ కారణంగానే ‘రయీస్’ ట్రైలర్ ఈ రేంజులో యూట్యూబ్‌లో దూసుకెళుతోందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అలాగే.. షారుఖ్ లుక్, నవాజుద్దీన్ యాక్టింగ్, కలర్‌ఫుల్ రొమాన్స్‌తో నిండిన ఈ మాస్ మసాలా ట్రైలర్ ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడం వల్ల ఎగబడి చూశారని చెబుతున్నారు.

కాగా.. రాహుల్ ఢోలకియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాద్‌షా సరసన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ కథానాయికగా నటించింది. 1980లో జరిగిన నిజజీవితం ఘటన ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ పాత్ర పోషిస్తుండగా.. రయీస్ క్యారెక్టర్‌లో షారుఖ్ ఖాన్ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో.. గత బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోతాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment