Gossipsలీడర్-2 కాదు.. ఫిదా లాంటి కథ..!

లీడర్-2 కాదు.. ఫిదా లాంటి కథ..!

హ్యాపీడేస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టించిన శేఖర్ కమ్ముల రీసెంట్ గా వచ్చిన ఫిదాతో మరోసారి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కెరియర్ లోనే మొదటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన శేఖర్ కమ్ముల తన తర్వాత సినిమా రానాతో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. రానా శేఖర్ కమ్ముల అనగానే లీడర్ లాంటి సినిమా ఆశిస్తారు.

లీడర్-2 గా ఈ కాంబినేషన్ సెట్ చేసుకున్నారని అనుకున్నారు. కాని వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చేది లీడర్ సీక్వల్ కాదని ఓ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. అయితే ప్రేమకథతో రానా హీరోనా కాదా అన్నది మాత్రం ఇంకా కన్ఫాం చేయలేదు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. రానాతో మాత్రం లీడర్ సీక్వల్ కచ్చితంగ చేస్తానని.. కాకపోతే దానికి కొంత టైం పడుతుందని అంటున్నాడు శేఖర్ కమ్ముల.

మరి శేఖర్ కమ్ముల ఫిదా లాంటి లవ్ స్టోరీతో సినిమా హిట్ అందుకోగా ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే అంటే కచ్చితంగా మళ్లీ హిట్ అందుకుంటాడని చెప్పొచ్చు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news