Gossipsబాహుబలి రికార్డులు బద్ధలు కొట్టిన సంజు..!

బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టిన సంజు..!

ఇండియన్ సినిమా చరిత్రలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. చరిత్రలో నిలిచిపోయేలా వసూళ్ల ప్రభంజనం సృష్టించిన బాహుబలి రికార్డులను బీట్ చేయడం బాలీవుడ్ సినిమాల వల్ల కూడా కాదని అనుకున్నారు కాని ఇటీవల రిలీజ్ అయిన సంజయ్ దత్ బయోపిక్ మూవీ సంజూ బాహుబలి రికార్డ్ బీట్ చేశాడు.

బాహుబలి-2 హింది వర్షన్ మూడవరోజు 46.50 కోట్లు వసూళు చేసింది. ఆ రికార్డును సంజు చెరిపేశాడు. సంజు మూవీ ఆదివారం కూడా 46.71 కోట్ల రూపాయలతో సంచలనం సృష్టించాడు. మొదటి రోజే 35 కోట్లతో ఈ ఏడాది బాలీవుడ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా సంజు రికార్డ్ నెలకొల్పాడు.

రణ్ బీర్ కపూర్ నటించిన ఈ సినిమా సంజయ్ దత్ జీవితానికి సంబందించిన చాలా విషయాలను ప్రస్థావించడం జరిగింది. హింది వర్షన్ మాత్రమే రిలీజ్ చేసినా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news