Gossipsసమంత సినిమాకు 'A' సర్టిఫికెట్..!

సమంత సినిమాకు ‘A’ సర్టిఫికెట్..!

పెళ్లికి ముందు పద్ధతిగా ఉన్న సమంత పెళ్లి తర్వాత హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. అంతేకాదు వరుస అవకాశాలు అందుకుంటూ మునుపటి క్రేజ్ కన్నా డబుల్ ట్రిపుల్ ఇమేజ్ సాధిస్తుంది. ప్రస్తుతం సమంత తెలుగులో మజిలీ.. తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలు చేస్తుంది. సూపర్ డీలక్స్ ఈ శుక్రవారం రిలీజ్ కు సిద్ధమైంది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా నటిస్తుంది.

సినిమాలో సమంత కూడా మధ్యతరగతి మహిళగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వారు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. అక్కినేని కోడలిగా మారాక సమంత మరింత రెచ్చిపోతుంది. ఆమె ఇలాంటి సినిమాల్లో నటిస్తుందని ఎవరు ఊహించలేదు. సూపర్ డీలక్స్ సినిమా అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు.

సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ శుక్రవారం సమంత సూపర్ డీలక్స్ తో వస్తే వచ్చే శుక్రవారం అంటే ఏప్రిల్ 5న మజిలీ సినిమాతో వస్తుంది. పెళ్లి తర్వాత నాగ చైతన్యతో సమంత నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news