Moviesసాహో.. సైరా.. మధ్యలో నాని.. సీన్ రివర్స్ అయితే..!

సాహో.. సైరా.. మధ్యలో నాని.. సీన్ రివర్స్ అయితే..!

ఓ పక్క సాహో మరో పక్క సైరా ఈ రెండు సినిమాల మధ్య నాని గ్యాంగ్ లీడర్. నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ముందు ఆగష్టు 15 రిలీజ్ అనుకున్నారు. కాని సాహో వల్ల సినిమాను 30కి రిలీజ్ అనుకున్నారు. సాహో అనుకోకుండా ఆగష్టు 30కి వాయిదా పడటంతో చేసేదేం లేక నాని తన సినిమాను మరోసారి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13న వస్తుందని అంటున్నారు.

అయితే మరో రెండు వారాల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా వస్తుంది. నాని సినిమా హిట్ టాక్ వచ్చినా రెండు మూడు వారాల్లో సేఫ్ జోన్ లోకి వస్తుంది. అయితే నాని గ్యాంగ్ లీడర్ హిట్ టాక్ వచ్చి సాహో, సైరాలలో ఏదైనా యావరేజ్ లేదా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం నాని పంట పడినట్టే లెక్క. అందుకే నాని అంత ధైర్యంగా రెండు పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ చేస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విలన్ గా కార్తికేయ కనిపిస్తున్నాడు. ఆరెక్స్ 100, గుణ 369 సినిమాలతో హీరోగా సక్సెస్ అయిన కార్తికేయ విలన్ గా చేయడం సాహసమే అని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news