Sportsసచిన్‌కు ఇష్టమైన స్టార్ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలిస్తే షాకవుతారు!

సచిన్‌కు ఇష్టమైన స్టార్ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలిస్తే షాకవుతారు!

The God Of Indian Cricket Sachin Tendulkar has revealed an interesting fact about his favourite batsman in Cricket which will releave will you in shock.

గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సాధించిన రికార్డులు ప్రపంచ క్రికెట్ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోయాయి. ఇటువంటి క్రికెటర్‌కు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తే ఎలాంటి బౌలర్ అయినా సరే వణికిపోవాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు అత్యంత ఇష్టమైన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలియజేశాడు. ఇంతకీ సచిన్‌కు అత్యంత ఇష్టమైన బ్యాట్స్‌మెన్ ఎవరో కాదు భారత డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్ ఒపెనింగ్‌కు వస్తుంటే అవతలి జట్టు బిత్తరపోయేవారు. వీరిద్దరి కాంబినేషన్‌ను ఎలా విడగొట్టాలా అని చాలా ప్రణాళికలు రచించేవారు. వీరివురు కలిసి సుమారు 10 సంవత్సరాల పాటు జోడీగా ఆడారు. సెహ్వాగ్ బ్యాటింగ్‌కు వస్తుంటే సచిన్ అతడు ఏం చేస్తాడో అని చాలా ఆసక్తిగా ఎదురుచూసేవాడట. సెహ్వాగ్ బ్యాటింగ్ చూస్తూ తాను చాలా ఆనంద పడేవాడిని అని చెప్పాడు సచిన్. ఇలా ఓ దేశం మొత్తం క్రికెట్ దేవుడిగా పూజించే సచిన్ సైతం సెహ్వాగ్ బ్యాటింగ్‌కు దాసోహం అనడం నిజంగానే విశేషం అని చెప్పాలి. ఇక తనకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోనే బౌలింగ్ అంటే విపరీతంగా భయపడేవాడినని సచిన్ ఈ సందర్భంగా తెలియజేశాడు. తన క్రికెట్ కెరీర్‌లో తనను చాలాసార్లు అవుట్ చేసిన బౌలర్ క్రేనే అని చెప్పుకొచ్చాడు సచిన్. ఇలా సెహ్వాగ్‌పై తన ఇష్టాన్ని వ్యక్తపరచడంతో అటు సచిన్ ఫ్యాన్స్‌తో సెహ్వాగ్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news