Gossips"సాహో టీజర్" ప్రభాస్ లుక్ అదిరిపోయిందిగా..!

“సాహో టీజర్” ప్రభాస్ లుక్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సాహో సినిమా నుండి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 అంటూ ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే రిలీజ్ అయిన ఈ మేకింగ్ వీడియో చూస్తే మనం చూస్తుంది తెలుగు సినిమా మేకింగ్ వీడియోనేనా అన్న ఆశ్చర్యం కలగక మానదు. సుజిత్ డైరక్షన్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వర్క్ అవుట్ కలిపి సాహోని సూపర్ రేంజ్ లో నిలబెట్టినట్టు ఉన్నారు.

చాప్టర్ 1 అంటూ నిమిషం నిడివి గల మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు. అభి దుబాయ్ లో చేసిన ఈ యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో చూసి నోట మాట రాలేదంటే నమ్మాల్సిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా సాహో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా అంచనాలకు తగినట్టుగానే దాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సీన్మా 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news