Gossipsక్రికెట్‌కు ఈ టాప్ క్రికెట‌ర్ల సేవ‌ల‌కు సెలువు..!

క్రికెట్‌కు ఈ టాప్ క్రికెట‌ర్ల సేవ‌ల‌కు సెలువు..!

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఎన్నో సంచలనాలకు కారణమైంది. నెలన్నర రోజుల క్రితం ప్రారంభమైన ఈ ప్రపంచకప్‌లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. లీగ్‌ స్టేజ్ అనంతరం ఆరు దేశాలు ఇంటికి వెళ్ళిపోగా అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైన‌ల్‌ ఆడేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్టు అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు… ప్ర‌స్తుత‌ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఢీకొంటుంది.

ఇదిలా ఉంటే ఈ ప్రపంచ కప్ చాలామంది సీనియర్ క్రీడాకారులకు ఆఖరి ప్రపంచకప్ గా మారనుంది. ప్రపంచ కప్ తర్వాత పలువురు టాప్ క్రీడాకారులు తమ క్రికెట్ జీవితానికి ముగింపు పలకనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ టోర్నమెంట్‌లో అంచనాలు అందుకో లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాత ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ధోనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ప్రపంచకప్ తర్వాత ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రపంచంలో మూడు మ్యాచ్లు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లో అసలు ఖాతా తెరవలేదు. దీంతో తన రిటైర్మెంట్ ఇదే సరైన సమయం అని భావించి మాలిక రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాళ్లు హషిమ్ ఆమ్లా,డేల్ స్టెయిన్, జేపీ.డుమినీ, స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సైతం ప్రపంచ కప్ తర్వాత వన్ డేల‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఎన్నో సంచలనాలకు కారణమైన హషిమ్ ఆమ్లా,డేల్ స్టెయిన్, జేపీ.డుమినీ,… తాహీర్‌ ఈ నలుగురు తమకు ఇదే చివరి ప్రపంచకప్ అని, ఈ ప్రపంచ కప్ తర్వాత వన్ డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ సైతం ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాన‌ని అన్నారు. వాస్తవానికి ఈ ప్రపంచకప్ ముందే రిటైర్ అవ్వాలనుకున్న మ‌లింగ‌ శ్రీలంక క్రికెట్ సంక్షోభంలో ఉండడంతో క్రికెట్ బోర్డు ఒత్తిళ్ల మేరకు ప్రపంచకప్‌లో కొనసాగాడు. ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేయ‌నున్నాడు. వీరితో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లలో కొందరు సీనియర్ క్రికెట్‌కు ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. వీరుకూడా ప్రపంచకప్ తర్వాత ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news