Gossipsహీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నేలా పూరి కూతురు..

హీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నేలా పూరి కూతురు..

టాలీవుడ్ డైరెక్టర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ జోష్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆరు వరుస ఫ్లాపుల తర్వాత ఎట్టకేలకు ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అవ్వ‌డంతో పూరి ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాతోనే చాలా సినిమాల తర్వాత హీరో రామ్ కు సైతం హిట్ వచ్చింది. ఇక నిర్మాత గా ఉన్న హీరోయిన్ ఛార్మికి లాభాలే లాభాలు. హిట్ జోష్ లో ఉన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ పై సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు.

సీనియర్ హీరోతో భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో పూరి బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే పూరీ కుమార్తె ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోను చూసిన వాళ్ళంతా పూరి కుమార్తె హీరోయిన్ల‌ను మించిన‌ అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. పూరీకి కొడుకు ఉన్నాడని తెలుసు. పేరు ఆకాష్. రెండు మూడు సినిమాల్లో కూడా హీరోగా నటించారు.

పూరి ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు చేసిన మెహ‌బూబా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక పూరి అమ్మాయి పేరు పవిత్ర. ఆ అమ్మాయి బుజ్జిగాడు మూవీలో చిన్నప్ప‌టి త్రిషగా నటించింది. ఇక ఆమె తాజా ఫొటోలతో అంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకుంటున్నా ఆమె హీరోయిన్‌గా చేస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఈ అమ్మడుకు డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రస్ట్ ట. మరి చూడాలి పూరీ ఆమెను ఎలా పరిచయం చేస్తారో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news